'ఒక తలుపు మూసివుంటే ఆ వెనువెంటనే మరో తలుపు మనకోసం తెరచుకుంటుంది. ఆ కృప ప్రభువు మనకెప్పుడూ ఇస్తూనే ఉంటాడు. కానీ తెరచుకున్న ద్వారాన్ని చూడలేకపోవడం మన దురదృష్టం' అంటారు హెలెన్కెల్లర్. 'హృదయ స్పందన ఎరుగని వ్యక్తి ఈ విశ్వంలో దేవుడు కలుగజేసిన రమ్యమైన ప్రకృతి దృశ్యాలను చూడలేడు, ఆ మధురిమలను ఆస్వాదించలేడు. తనకున్న మానసిక అవిటితనంతో సమాజమే అవిటిదైపోయిందని వాపోతుంటాడు. ఇది ఒక విషాదం. ఇలాంటి మానసిక రుగ్మత నుంచి బయటపడాలని నా ఆరాటం, పోరాటం' అంటూ దానికోసం తనకున్న అంధత్వాన్ని లెక్కచేయకుండా పోరాడిన ధీరవనిత హెలెన్కెల్లర్.. Read more