
Read more
![]() విజయవాడలోని ఓ హాస్పిటల్‌లో కల్పనను చేర్పించారు. అదేపనిగా నొప్పులు వస్తున్నా, ప్రసవం మాత్రం కావటం లేదు. కల్పన భర్తా, తల్లీ ఒకటే కంగారుపడుతున్నారు. డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సమయం మించిపోతోంది. 'బలవంతంగా ప్రసవం చేయక తప్పదు' అన్నారు డాక్టర్లు. 'ఆమెకు ఏం కాదు కదా?'... కల్పన భర్త.... 'నా కూతురికి ఏ ముప్పూ రాదు కదా?' - కల్పన తల్లి... వాళ్లిద్దరూ అడుగుతూనే ఉన్నారు. కాసేపటికి 'ఆడపిల్ల మహాలక్ష్మిలా ఉందే! అచ్చు గుద్దినట్లు నీపోలికలే' తల్లి గొంతు విన్న కల్పనకు అంత నీరసంలోనూ ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. మరికొన్ని క్షణాలకే డాక్టర్ పసికందును కల్పన చేతుల్లో ఉంచుతూ... 'క్షమించండి, ప్రసవం సమయంలో పాప నుదుటి నరాలు బాగా నొక్కుకు పోయాయి' అని చెప్పారు. మూడు రోజుల తరవాత 'పాప, శారీరక వైకల్యానికి గురిచేసే సెరిబ్రల్ పాల్సీ బారిన పడే అవకాశం ఉంది' అని మిగతా వైద్యులు చెప్పడంతో కల్పన మాట్లాడలేకపోయింది.
Read more
0 Comments
Leave a Reply. |