
![]() ఆమె జీవితం ఆదివాసులతో పెనవేసుకునిపోయింది. వారి కన్నీళ్లు, వేదనలు, కటికదారిద్య్రం, దుర్భరజీవన విధానం ఆమెను కదిలించాయి. అందుకే వారినే తన జీవనంగా మలచుకుంది. ఆ స్పందనే ఆమెను వారికి 'మహామాత'గా చేసింది. ఒక బిడ్డకోసం తల్లడిల్లే తల్లి మనసు ఆదివాసుల ఆక్రందన విని కళ్లు చెమ్మగిల్లేవి. చీకటిలో జీవిస్తున్న ఆదివాసులకు వెలుగును నింపేందుకు ఓ అబలగా తన శక్తిసామర్థ్యాలతో ఏమీ చేయలేనని గ్రహించిన ఆ వనిత తనకున్న రచనాశక్తితో వారి వెట్టిచాకిరీని సభ్యసమాజానికి చాటిచెప్పింది. ఒక్క కలం చాలు ఈ సమాజాన్ని మార్చేందుకు అని నమ్మిన ఆమె ఆ కలమే తన ఆయుధంగా మలచుకుని అహర్నిశలు శ్రమించారు. ఆమె ఎవరో కాదు మహాశ్వేత సుగథకుమారి మృణాల్ పాండే. Read more...
0 Comments
Leave a Reply. |