Read more.............
చదువుకోకుండా పేదరికం అడ్డంకులు కల్పిస్తుందన్నది నిజమే. అలాగని దాన్నే తలుచుకుంటూ ఉండిపోతే అక్షరం ముక్క రాదు. అడుగు ముందుకు పడదు. చదువుకోవడం ఓ సవాలు అయినప్పుడు దాన్ని స్వీకరించాలి. కష్టాలను ఓర్చుకుంటూ చదువుల తీరం చేరుకోవాలి. ఉత్తరప్రదేశ్‌కి చెందిన రజియా సుల్తానా, కర్ణాటకకు చెందిన అశ్విని ఇలాగే చేశారు.రజియా సుల్తానాది మీరట్ జిల్లాలోని మారుమూల గ్రామం నాంగలకుంభ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పని చేస్తేనే ఇల్లు గడిచే పేద కుటుంబం వాళ్లది. అక్కడున్న చాలా కుటుంబాల మాదిరే... రజియా, ఆమె తల్లిదండ్రులకు ఫుట్బాల్లు కుట్టడమే జీవనోపాధి. ఐదేళ్ల వయసులో బడికి వెళ్లాల్సిన రజియా, అమ్మానాన్నలతో కలిసి పనికి వెళ్లడం మొదలుపెట్టింది...................... పేదరికమే పెద్ద కష్టమంటే, అశ్వినికి పుట్టుకతో చూపు లేకపోవడం మరో పెద్ద సమస్య. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ పూట గడవని పరిస్థితి అశ్విని కుటుంబానిది. దాంతో అశ్వినికి వైద్యం చేయించడం, ఆలనాపాలనా ఆమె తల్లిదండ్రులకు తలకు మించిన భారమైంది. ఇటు చూపులేక, అటు కుటుంబ సభ్యుల ఆప్యాయత అందక అశ్విని మానసికంగా కుంగిపోయింది. 'ఎందుకీ జీవితం' అని బాధపడుతున్న అశ్వినికి చదువు ధైర్యాన్నిచ్చింది.......................
Read more.............
0 Comments
Leave a Reply. |