అది 2005, ఏప్రిల్ 22. ఎప్పటిలానే మార్కెట్ రోడ్డు జనంతో కిటకిటలాడుతోంది. స్కూళ్లకూ, ఆఫీసులకూ వెళ్లే వాళ్లతో బస్‌స్టాప్ మరీ రద్దీగా ఉంది. అప్పటికే లక్ష్మి అక్కడికొచ్చి అరగంట దాటింది. ఆమె కళ్లల్లో వచ్చే ప్రతి బస్సూ తనెక్కాల్సింది అయితే బాగుండునన్న ఆరాటం! చెట్ల మధ్య జింకలా జనం మధ్యలో నిల్చున్న ఆమె, అక్కడే ఓ 'మనిషి వన్నె పులి' నక్కి ఉందని గుర్తించలేకపోయింది. చూస్తుండగానే, తను ఎక్కాల్సిన బస్సు వచ్చింది. అది ఎక్కడ ఆగకుండా వెళుతుందోనన్న కంగారులో జనాన్ని తోసుకుంటూ ముందుకొచ్చింది. అంతలో బస్సును దాటుకుంటూ ఓ బైకు ఆమె మీదకు దూసుకొచ్చింది. దాని మీదున్న వ్యక్తి ఒక్కసారిగా లక్ష్మి మీదకు దూకి, జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ రోడ్డుమీద పడేశాడు. Read more.......
0 Comments
Leave a Reply. |