
![]() ‘ప్రతి మహిళా చదువుకోవాలి.. అన్ని రంగాల్లోనూ అతివలు రాణించాలి.. ప్రగతి పథంలో మన దేశం దూసుకుపోవాలంటే స్ర్తిల భాగస్వామ్యం తప్పనిసరి.. మహిళా శ్రేయస్సుకు అవరోధంగా నిలిచే మూఢాచారాలను, ఛాందస భావాలను అందరూ ముక్తకంఠంతో నిరసించాలి..’- ఈ మాటలు ఎప్పటికీ అక్షర సత్యాలు. కాలం ఎంతగా మారినా స్ర్తిలకు సంబంధించి ఇప్పటికీ ఎనె్నన్నో నిర్బంధాలు, అర్థం లేని కట్టుబాట్లు తప్పడం లేదు. అందుకే- మహిళ విద్యతో చైతన్యవంతమైతేనే కు టుంబం, తద్వారా సమాజం బాగుపడుతుందని ఆమె నేటితరం వారికి ఉద్బోధిస్తుంటారు. మాటల్లో గాక, ఆదర్శాలను ఆచరణాత్మకంగా పాటిస్తూ ఆమె ఎందరెందరిలోనో స్ఫూర్తిని రగిలించారు. స్ర్తి విద్య, వితంతు వివాహాలు, వేశ్యావృత్తి నిర్మూలన వంటి విషయాల్లో దశాబ్దాల పాటు కృషి చేసిన ఆమె పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శప్రాయం. ప్రస్తుతం విశాఖపట్నంలో శేష జీవితాన్ని గడుపుతున్న చెల్లూరి వెంకట రమణమ్మ (95) మహిళా సంక్షేమానికి ఇంకా జరగాల్సింది ఎంతో ఉందని చెబుతుంటారు.Read more...
0 Comments
Leave a Reply. |