Read more........
ఐదేళ్ల క్రితం... మహిళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గుజరాత్ ప్రభుత్వం అటవీ శాఖలో పని చేసేందుకు అభ్యర్థులను ఆహ్వానించింది. రాత, దేహదార్డ´్య పరీక్షల అనంతరం నలభై మంది మహిళల్ని ఎంపిక చేసింది. జంతు సంపదను కాపాడటం, కలప అక్రమ రవాణాను అడ్డుకోవడం, స్థానిక గిరిజనులు వంట చెరకు కోసం చెట్లను కొట్టకుండా చూడటం, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణం స్పందించడం వీరి బాధ్యత. ప్రభుత్వం వీళ్లందరికీ తుపాకులూ, బుల్లెట్ బైకులూ, వాకీటాకీలూ, సెల్‌పోన్లూ, కెమెరాలూ అందించింది. అడవిలో తప్పిపోకుండా జీపీఆర్‌ఎస్ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. కంట్రోల్ రూమ్‌లో ఉండి పర్యవేక్షిస్తే, అడవిలో ఎవరు ఎక్కడ ఉన్నారనే సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుంది.
Read more........
0 Comments
Leave a Reply. |