Read more.........
ఫొటోగ్రఫీ... కంటికి కనిపించే దృశ్యాలను అందమైన వర్ణకావ్యంగా అచ్చువేసే కళ. ఫొటో... మురిపించే క్షణాల్ని సజీవంగా ఉంచే శిల్పం. ఒక ఫొటో చక్కగా రావాలంటే చేతిలో కెమెరా ఉంటే సరిపోదు. అందాన్నీ, అందులోని సున్నితత్వాన్నీ గమనించే గుణం ఫొటో తీసే వ్యక్తికి ఉండాలి. ఒకప్పుడు 'స్మైల్ ప్లీజ్' అంటూ ఒకే ఒక డైలాగ్‌తో ఫొటోగ్రాఫర్ పని పూర్తయ్యేది. నలుగురిని వరుసగా నిల్చోబెట్టి 'క్లిక్'మనిపించేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అభిరుచులు మారాయి. టెక్నాలజీ మారింది. ఫొటోని కళాత్మకంగా తీసే వాళ్లూ పెరిగారు. నిన్న మొన్నటి వరకూ ఫొటోగ్రాఫర్లంటే మగవాళ్లే అందరి మదిలో మెదిలేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారింది. అమ్మాయిలకి టీచర్ ఉద్యోగాలైతే బాగుంటాయి... ఉదయం తొమ్మిదికి వెళ్లి సాయంత్రం ఆరింటికల్లా ఇంటికి వచ్చేయచ్చు. ఇలాంటి సంప్రదాయపు ఆలోచనల గోడలు కొన్నాళ్ల క్రితమే బద్దలై, అమ్మాయిలు అన్ని రంగాల్లోకి అడుగుపెట్టడం ప్రారంభించారు. ఇప్పుడు మరింత ముందుకు దూసుకెళుతూ కొత్త కెరీర్‌లను ఎంచుకుంటున్నారు. లక్షలు తెచ్చే జీతాల్ని వదులుకుని ఆసక్తి ఉన్న పనినే చేయడానికి ఇష్టపడుతున్నారు.
Read more.........
0 Comments
Leave a Reply. |