
![]() 'జీవితంలో అన్ని సమస్యలూ పరీక్షించడానికే వస్తాయి. ఏవీ కూడా చనిపోయేంత పెద్దవి కావు' అని తన స్కూళ్లో చదివే పిల్లలకు తరచూ చెబుతుంటుంది బెర్తా ధికర్. ఆమె జీవితానుభవం నుంచి చెప్పే పాఠమే అది. భవిష్యత్తులో ఏమవుతుందో ముందే తెలిస్తే, అంతకంటే నరకం మరోటి ఉండదు. కొన్నేళ్ల క్రితం బెర్తా పరిస్థితి కూడా అలాంటిదే. డిగ్రీ చదివేప్పుడు తనకు క్రమంగా కంటిలోపలి రెటినాను తినేసి చూపుపోయేలా చేసే 'రెటినైటిస్ పిగ్మెంటోసా' అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యాధిని తగ్గించడం ఎవరి వల్లా కాలేదు. అంత మాత్రాన నిరాశపడి ఖాళీగా కూర్చోలేదు. 'పూర్తిగా చూపు పోయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే చదవగలుగుతున్నా కదా' అని ధైర్యంగా పీజీలో చేరింది. కానీ వ్యాధి తన పని తాను చేసుకుపోవడంతో పీజీ సగంలో ఉండగానే ఆమె చూపును పూర్తిగా కోల్పోయింది. Read more.........
0 Comments
Leave a Reply. |