
‘సుమనహళ్లి మదర్ థెరిస్సా ’గా పేరు పొందిన ఈ విదేశీ మహిళ బ్రిటన్ నుంచి వచ్చింది. ఒక చిన్న మోపెడ్‌ను నడుపుకుంటూ వెళ్ళే ఈ క్రైస్తవ మఠ సహోదరి, న్యూకాస్టిల్ నుండి వచ్చి ఇక్కడే స్థిరపడి 29 సంవత్సరాలుగా కుష్ఠురోగులకు సేవలందిస్తోంది.
అంతర్జాతీయంగా ఒక అనూహ్యమైన గుర్తింపును పొందింది మదర్ థెరిస్సా. చరిత్రలో ఈమే ఈ రంగంలో అత్యంత సేవలందించి జన్మ చరితార్థం చేసుకున్న తొలి మహిళ. ఈమె కూడా విదేశీయురాలే. ఇదే మార్గంలో మరికొందరు ప్రయాణిస్తూ, థెరిస్సా అడుగుజాడల్లో నడుస్తున్నారన్నది యథార్ధం. థెరిస్సా ప్రపంచదేశాల్లో ఎందరికో ఆదర్శంగా, చెరగని ముద్రవేసుకుంది. అదే మార్గంలో పయనిస్తూ రెండో మదర్ థెరిస్సాగా కొనియాడబడుతోంది జీన్.... Read more