ఆత్మవిశ్వాసాన్నే ఆలంబనగా చేసుకొని సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు తహతహలాడారు. అంగవైకల్యం అడ్డుగా నిలిచినా తాము కన్న కలలను సాకారం చేసుకునేందుకు, ఐదువేళ్లు నోట్లోకి వెళితేనే ముద్ద నోట్లోకి వెళుతుందని ఆ ఐదుగురు మహిళలు నిరూపించారు. ఆసరా ఇచ్చే చేతులను అందిపుచ్చుకొని కేవలం 200 చదరపుటడుగుల దుకాణంతో వారు వేసిన అడుగు నేడు స్వావలంబన దిశగా పయనిస్తోంది. రెండు నెలల క్రితమే కేరళలోని వాజిచల్ సమీపంలో ఏర్పాటుచేసిన ఆ దుకాణంలో ప్రతి వస్తువు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ దుకాణంలోని ప్రతి వస్తువు వెనుక వారి శ్రమ, నైపుణ్యం, అంతకమించి వాటిని తయారుచేయటంలో చూపించే శ్రద్ధ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అందుకే అక్కడి వస్తువులన్నీ కష్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. నేడు ఈ దుకాణం రూపురేఖలే మారి పోయాయ. ఆ ఐదుగురు మహిళలు 40 నుంచి వంద శాతం వివిధ రకాల వైకల్యంతో బాధపడుతున్నవారే. ఈ ఐదుగురు ఓ టీమ్‌గా తయారై, కలిసికట్టుగా పనిచేస్తే ఈ సమాజమే తమను గుర్తిస్తుందని నిశ్చయించుకున్నారు. ఇంకా చదవండి.
1997లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు
యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు 1990లో అర్జున అవార్డు ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ నందు అసిస్టెంటు కమాండెంట్ ఇండియన్ వెయిట్ లిప్టింగ్‌లో పేరుగాంచిన భారతీయ క్రీడాకారిణి కుంజరిని. కుంజరిని మార్చి 1,1968లో మణిపూర్ లోని ఇంపాల్ నందు గల ెకైరంగ్ మయై లేఇెకై నందు జన్మించారు. 1978 ఇంపాల్‌లోని సిండం సిన్శాంగ్ రెసిడెంట్ ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడే క్రీడల పట్ల ఆకర్షితురాలైనది. ఇంపాల్‌లోని మహారాజ బోధ చంద్ర కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ఆమె సమయమంతా వెయిట్ లిఫ్టింగ్ నందు కేటాయించినది . ప్రస్తుతం ఆమె అసిస్టెంట్ కమాండెంట్‌గా సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది.1996 నుంచి 1998 వరకు రక్షకదళాధిపతిగా క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించినది. ఇంకా చదవండి ....... 1991లో చైనీస్ జర్నలిస్ట్ అవార్డు
1998లో పద్మశ్రీ, 1985లో అర్జున అవార్డు అంతర్జాతీయ వేదికలపై దేశం తరఫున 75 సార్లు పోటీ ఆసియా ట్రాక్ ఫీల్డ్ పోటీలలో అరుదైన రికార్డు చిన్నప్పటి నుంచి క్రీడలలో రాణించాలని పట్టదల ఉండేది. అదే పట్టుదలతో రాణించి దేశం గర్వించే విధంగా జాతీయ, అంతర్జాతీ చాంపియన్‌షిప్‌లలో పలు పతకాలు సొంతం చేసుకుంది షైనీ. ఆమె అత్యుత్తమ క్రీడా ప్రదర్శనకు ేకంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు, పద్మశ్రీ వంటి అవార్డులతో సత్కరించింది. ఆసియా ట్రాక్ ఫీల్డ్ పోటీల నుంచి వరుసగా ఆరుసార్లు ఆసియా ట్రాక్ ఫీల్డ్ పోటీలలో పాల్గొని ఈ ఘనత సాధించిన ఏెకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఇంకా చదవండి .......... |