Read more.............
లక్ష్మి... పదేళ్ల క్రితం వరకు ఈమె జీవితం వేరు. ఉదయమంతా భర్త పట్టిన చేపల్ని అమ్ముకొచ్చేది. ఆ రోజు గిరాకీ బాగుంటేనే రాత్రికి తిండి దొరికేది. దానికి తోడు చేతినిండా అప్పులు. డబ్బుల్లేవని చెప్పినా వడ్డీ కట్టందే రేవులోకి నావని వెళ్లనిచ్చేవారు కాదు వడ్డీ వ్యాపారులు. పిల్లలకి సరైన బట్టలు కొనలేని, చదువు చెప్పించలేని పరిస్థితి.మరిప్పుడో... ఆమె ఇద్దరు కొడుకుల్లో ఒకర్ని ఇంజినీరింగ్, ఇంకొకరిని డాక్టర్ చదివిస్తోంది. ఇల్లు కట్టుకుంది. కొంత భూమి కొనుక్కుంది. ఇంత మార్పు ఒక్కరోజులోనో, ఒకరి వల్లో వచ్చింది కాదు. కలిసికట్టుగా మహిళలు సాధించిన విజయం.
Read more.............
0 Comments
ఆత్మీయాక్షరాల పూల పొట్లం గుమ్మంలో గుబాళించేది. దూరాల దారాల్ని కలిపే ‘తపాలా’ ప్రతిరోజూ పలకరించేది. కవరు విప్పుతున్నప్పుడు పావురాల రెక్కల చప్పుడు. కిటికీ ఊచల మధ్య పూతరేకుల దొంతర్లాంటి కార్డులు, కవర్ల బరువు మోస్తూ ఉత్తరాల తీగ. ఆ తీగ మీటితే ఎన్ని అను‘రాగాలు’ వర్షించేవి.. ఇదంతా ఒక అక్షర స్మృతి. ఇప్పుడు రసరేఖల్లాంటి లేఖలు రాసి పులకింపజేసేదెవరు?.. ఎస్ఎంఎస్లు, ఈ మైళ్ల తుఫాన్లో చిక్కుకుని ఘనమవుతున్న పోస్టల్ దీపాన్ని ఆరిపోనీకుండా చేసే చిరుయత్నంలో ఆ ఆడపడుచులు భాగస్వాములు.
Read more......... పడతుల పాలన.. పల్లెకు లాలన
ఆ గ్రామానికో ప్రత్యేకత వుంది. కేవలం ఏడు వార్డులే ఉన్న ఆ చిన్న పంచాయతీకి సర్పంచ్ నుంచి వార్డు సభ్యుల వరకూ అందరూ మహిళలే. సంకల్ప బలం తోడైతే అసాధ్యమంటూ లేదని నిరూపించిన ఆ మహిళా ప్రజాప్రతినిధులందరూ 40 ఏళ్ల వయసు లోపు వారే. పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో కుల్తిక్రి గ్రామం మహిళా సాధికారితకు నిదర్శనంగా నిలుస్తోంది. అక్షరాస్యతలోనూ, ఆర్థిక స్వావలంబనలోనూ అక్కడి మహిళలు ఎందరికో స్ఫూర్తిదాతలుగా నిలిచారు.......... Read more |