
మాది మారుమూల గ్రామం. అమ్మాయిలకు రక్షణ తక్కువ. ఈ కారణాలతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేవారుకాదు. మా అమ్మానాన్నలు రోజు కూలీలే. కానీ నన్ను బాగా చదివించాలని కలలు కన్నారు. ఇబ్బంది అయినా బడికి పంపేవారు. నాకు పదేళ్లు ఉన్నప్పుడు నాన్న అనారోగ్యంతో చనిపోయారు. తట్టుకోలేకపోయా. బడికెళ్లడం మానేశా. అమ్మ ఓదార్చింది. 'నువ్వు చదువుకుని ఈ గ్రామం వాళ్లకీ దారి చూపిస్తావని నాన్న అనుకుంటే ఇలా చేస్తావేం..' అని కోప్పడింది. దాంతో స్కూలు దూరమైనా ధైర్యంగా వెళ్లేదాన్ని. ఇంకా చదవండి ........