బట్టలఫై బాల్ పాయింట్ ఇంకు పడితే.. టూత్ పేస్ట్ గానీ, నిమ్మరసం గానీ, బ్రాందీ లేదా విస్కీ చుక్కలు వేసి రుద్దాలి.
0 Comments
దుప్పట్లు ఉతికిన తర్వాత వెనిగర్ గాని, నిమ్మరసం గాని కలిపిన నీటిలో జాడిస్తే దుప్పట్లు శుభ్రంగానూ, సువాసనభరితంగా ఉంటాయి.
ఆమ్లెట్ కు మరింత రుచి రావాలంటే కొద్దిగా కొబ్బరి కోరు కలిపితే.. మరింత రుచిగా ఉంటుంది.
వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
బొంబాయి రవ్వ ఉప్మా వండేటపుడు ఉండలు కట్టకుండా ఉప్మా రుచిగా ఉండాలంటే.. బొంబాయి రవ్వకు ఒక చెంచా నూనె కలపాలి.
ప్లాస్క్ ను ఎంత శుభ్రపరచిన దుర్వాసన వస్తుంటే.. మజ్జిగతో కడిగితే సరి..
అరటికాయలను ముక్కలుగా కోసేటప్పుడు తోలు తీసిన తర్వాత మజ్జిగ కలిపిన నీళ్ళల్లో వేస్తే అరటికాయ నల్లగా మారదు. క్యాబేజీ వండేటప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే వాసన రాదు.
ఎండు కొబ్బరిని సులభంగా తురమాలంటే దానిఫై కొద్దిగా నీళ్ళు చల్లి ఫ్రిజ్ లో ఉంచితే సరి.
పచ్చి కొబ్బరి లోపల నిమ్మరసం పూస్తే కొబ్బరి నిల్వ ఉంటుంది.
|