ఆకు కూరలను వండేటప్పుడు అందులో చింతపండు, నిమ్మరసం వంటివి కలిపి వండితే కూర రంగు మారి, అందులో ఉన్న పోషక విలువలు కోల్పోతుంది. సో... ఆకు కూరల్లో ఈ రెండింటిని చేర్చకుండా వండాలి.
గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే డబ్బాలో కాస్త ఉప్పును మూట కట్టి వేయాలి.
వెండి సామాగ్రి భద్రపరిచే డబ్బాలో చిన్న సుద్దముక్క వేయాలి. అది తేమను పీలుస్తుంది. దాంతో వెండి ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటుంది.
నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.