- బి-కాంప్లెక్స్ క్యాఫ్యూల్స్‌ను ఓపెన్ చేసి ఫ్లవర్ వాజ్‌లో వేస్తే వాజ్‌లోని పువ్వులు ఎక్కువ కాలం తాజాగా కనిపిస్తాయి.
- నోటి పుండ్లకు మంచి మందు కొబ్బరి బోండంలోని నీరు. ప్రతీ రోజూ ఉదయమే కొబ్బరి బొండం తాగితే 15 రోజుల్లో నోటి పుండ్లు పోతాయి.
- మామిడికాయ పప్పు చేసేటప్పుడు మామిడి ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పప్పులో వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
- నిమ్మకాయల నుండి త్వరగా రసం తీయాలంటే చల్లని నీళ్లలో ఒక అరగంట పాటు నిమ్మకాయలు వేసి ఉంచితే కాయలు మెత్తబడి రసం సులువుగా వస్తుంది.
- వెలుల్లి, అల్లం ముద్ద చేసేటప్పుడు మిక్సీలో చెంచాడు నూనె వేస్తే బరకగా కాకుండా మెత్తగా రుబ్బుకోవచ్చు. ఎక్కవ రోజులు నిల్వ ఉంటుంది.
- క్యాండిల్ ఎక్కువ సమయం వెలగాలంటే... ఒక గ్లాసులో కొవ్వొత్తిని అంటించి గ్లాసు సగం వరకు నీటిని పోసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల క్యాండిల్ ఎక్కువ సేపు వెలుగుతుంది. కరిగిన మైనం నీటిలోనే పడుతుంది కాబట్టి సులభంగా తొలిగించవచ్చు.
- చీమలు పుట్ట ద్వారం వద్ద సబ్బు ముద్దనూరితే చీమలు పోతాయి. నల్ల చీమలు పుట్టకు కూడా ఇదే చిట్కాను పాటించండి.
- టమాటోలను వంటలో ఉపయోగించే ముందు 6 నిముషాల వరకూ వేడి నీటిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది.
- జిడ్డుగా ఉండే పాత్రలు శుభ్రం చేసే ముందు ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో పాత్రపై రబ్ చేయాలి. తర్వాత పేపర్‌తో పాత్రను తుడవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు పోతుంది. చాలా సులభంగా పాత్ర శుభ్రం అవుతుంది.
0 Comments
|