telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

వంటింటి చిట్కాలు 

9/26/2013

0 Comments

 
  • అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
  • వేపుడు పని ఎక్కువగా ఉంటే నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే నూనె ఎక్కువగా పీల్చదు.
  • కూరకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే మార్కెట్లో దొరికే మామిడి పొడికి కొంచెం పెరుగు కలపండి. టొమాటో రుచి వస్తుంది.
  • కోడిగుడ్లు పెంకును జాగ్రత్తా పరిశీలించండి. మంచి షైనింగ్‌ ఉంటే కోడి గుడ్లు తాజావి. పెంకు కాస్తా రంగు మారిందంటే నిల్వ కోడిగుడ్లని అర్ధం చేసుకోవాలి.
  • పెద్ద ఉల్లి పాయ, ఉప్పు కలిపి నూరి దానికి పంటికి వేసి రుద్దితే పండ్లవెంట కారే రక్తం ఆగిపోతుంది.
  • గచ్చకాయ కాల్చిన మసి, పటిక,పోక చెక్క మసి- మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపు, చీము, నెత్తురు కారటం,నోటి దుర్వాసన తగ్తుతాయి.
  • క్యారెట్‌, టమాటో కలిపి జ్యూస్‌ చేసి, తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్త శుద్ధి అవుతుంది.
  • ప్రతీరోజు నీళ్లలో తులసి అకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇనె్‌‌ఫన్‌ తగ్గుతుంది.
  • స్వచ్ఛమైన ఇంగువ నిమ్మ రసంతో నూరి దానిని పండ్లకి వేసి రుద్దితే పండ్లవెంట కారే రక్తం ఆగిపోతుంది.
  • మిక్సీ బ్లేడు పదునుగా ఉండాలంటే మిక్సీ జార్లలో కొద్దిగా ఉప్పు వేసి తిప్పాలి.
  • పనీర్‌ ఎక్కువ కాలం తాజాగా ఉండా లంటే దానినిక బ్లాటింగ్‌ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.
    జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
  • గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్‌ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇనె్‌‌ఫన్‌ బాధ నుంచి బయట పడవచ్చు.
0 Comments

చిట్కాలు పాటిస్తే వంట సులువే..!

9/2/2013

0 Comments

 
Picture
                 ఆ రోజు లక్ష్మి కూరగాయల మార్కెట్‌కు వె ళ్లింది. అక్కడ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కేజీ ఉల్లిపాయల ధర డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పలుకుతోంది. ఇక అల్లం, పచ్చిమిరపకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏ కూరగాయల ధరలు అడిగినా గుండెలదిరిపోతున్నాయి. తా ను తీసుకువచ్చిన డబ్బు దేనికీ సరిపోదని ఆమెకు అర్థమయింది. ఇక చేసేది లేక గబగబా మామూలు ధరలకు లభించే ఆకు కూరలు, కరివేపాకు, కొత్తిమీర వంటివి కొని ఇంటికి చేరింది. ఆ ధరలకుమల్లే ఆమె వొళ్లు కూడా మండింది. ఇంటికి చేరగానే చేతి సంచీని ఓమూలకు గిరాటేసి, నడుముకు కొంగు దోపుకుని వంటింట్లోకి దారితీసింది.

                     వంటింట్లో డబ్బాలు వెతగ్గా ఎప్పుడో తమ ఊరికి వెళ్లినప్పుడు తెచ్చుకున్న ఉలవలు కన్పించాయి. వెంటనే వాటి పనిబట్టింది. ఉలవల్ని నానబెట్టింది. తరువాత తగినంత కొబ్బరిపొడి, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి దంచి, చింతపండుతో ఉలవ చారు చేసింది. కొత్తిమీర వెయ్యటం మరచిపోలేదు. కరివేపాకు, పోపు వేసి చేసిన ఉలవ చారు ఘుమఘుమలాడుతోంది. తరువాత కొంత కందిపప్పు వేయించి ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి కంది పచ్చడి చేసింది. మిరియాలను ఉప్పులో వేసి దంచి కోడిగుడ్డు గిలక్కొట్టి ఆమ్లేట్ వేసింది. అంతే తప్ప ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల జోలికి వెళ్లనేలేదు. ఇక అప్పడాలు, వడియాలు వంటివి ఇంట్లో ఉండనే ఉన్నాయి. ఆ వేళ భోంచేస్తున్నప్పుడు తెగ మెచ్చుకుంటూ భర్త, పిల్లలు తృప్తిగా తినటం గమనించింది.

                ‘‘రోజూ వంట ఇలాగే చెయ్యి. ముద్దపప్పు, ఏవో కాయగూరలు వండి పడేసేదానివి. ఈవేళ వంట బాగా కుదిరిందోయ్..!’’- అని భర్త అంటుంటే ఆశ్చర్యానందాలలో ఆమె చూస్తూండిపోయింది.

                మరుసటి రోజు షరా మామూలే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వెయ్యకుండానే గుప్పెడు శనగపప్పు నానబెట్టి కరివేపాకు, రెండు ఎండు మిరపకాయలు, పోపు దినుసులు నూనెలో వేసి తిరగమోత వేసి ఘుమఘుమలాడే ఉప్మా తయారుచేసింది. భర్త, పి ల్లలు ఎంతో బాగుందని ఎంతో మెచ్చుకుంటూ తిన్నారు.

                     ఇవే చిట్కాలను ఆమె తన ఫ్రెండ్స్‌కు చెప్పింది. వాళ్ళు కూడా తాము ఉల్లిపాయలు వంటి ఖరీదైన వాటి జోలికి పోవడం లేదని, వాటి ధరలు దిగే వరకూ కొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ధరలు మండు తున్న నేటి రోజుల్లో లక్ష్మిలాగే మనం కూడా కొన్ని చిట్కాలు పాటిస్తే డబ్బు ఆదా చేసే వీలుంది.

* టమాటాలు అధిక ధరలు పలుకుతున్నప్పుడు పప్పులాంటి వంటకాల్లో వాటికి బదులుగా ఏ చింతపండో, మామిడికాయో, చింతచిగురో వేస్తే వంట రుచికరంగా ఉంటుంది.
* కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలామంది పెరట్లో కరివేపాకు చెట్టుంటుంది. కాస్త చింతపండు, వెల్లుల్లి, కారప్పొడి లేదా ఎండు మిరపకాయలు, జీలకర్ర వేసి పచ్చడి చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
* పచ్చిపులుసు, మిరియాల చారు చేసే సమ యంలో ఖరీదైన పచ్చిమిర్చికి బదులుగా ఇంట్లో నిలవ వుంచుకున్న ఎండుమిరపకాయలు ఉపయోగించుకోవచ్చు. మాంసాహారులు ఉల్లిపాయలు, అల్లం ఉపయోగించకుండానే మటన్ లేదా చికెన్‌ను రుచికరంగా వండుకోవచ్చు. మొదట కుక్కర్‌లో మటన్ లేదా చికెన్‌తో పాటు కాస్త పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. నీళ్లు ఇగిరిపోయాక కావాల్సిన మేరకు మిరియాలు, వెల్లుల్లి అందులో వెయ్యాలి. కారం కోసం నాలుగైదు ఎండుమిరపకాయలు సరి పోతాయ. కొత్తిమీర సన్నగా తరిగివేసినా బాగుంటుంది. ఇష్టపడే రుచికి తగ్గట్టు వండుకోవచ్చు.
* పలావ్ చెయ్యాలన్నా ఓ నాలుగు యాలక్కాయలు, నూనె లేదా నెయ్యిలో నలగ్గొట్టి వేసి వేయించిన తరువాత ఎసరు పెట్టి వండుకోవచ్చు. రంగు రావాలంటే ఏ జిలేబీ కలరో, పసుపో వేసుకుంటే బాగుంటుంది.
‘ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు’-అని విచారించే బదులు, మనకు అందుబాటులో ఉన్న వాటితో పొదుపు పాటించేలా ఆహార పదార్థాలు వండుకునే వీలుంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి నేడు అధిక ధరలు పెట్టి ఏది కొనాలన్నా బాధగానే ఉంటుంది. తగిన ప్రత్యామ్నా య పద్ధతులను అనుసరించి, మనసు పెట్టి వండితే అందరికీ తృప్తిగా ఉంటుంది. పొదుపు మంత్రం పాటించి ప్రతి గృహిణి ఆర్థిక సమస్యల నుంచి సులువుగా గట్టెక్కవచ్చు.


0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    ఆకు కూరలు
    రవ్వ
    నూనె
    ఉసిరి
    అల్లం
    వెండి సామాగ్రి
    బట్టలు
    మజ్జిగ
    పెరుగు గుణాలు... పలువిధాలు
    కిచెన్ కార్నర్
    గుడ్డు పెంకులతో భలే చిట్కాలు!
    అరటికాయ
    ఆమ్లెట్
    కొబ్బరి
    పోషకాలు పోకుండా..
    ప్లాస్క్
    నిమ్మకాయ
    క్యాబేజీ
    చిట్కాలు పాటిస్తే వంట సులువే..!
    క్యాండిల్‌ ఎక్కువ సమయం వెలగాలంటే...
    కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో...
    వాటర్ ఫిల్టర్ శుభ్రతకోసం ఎలాంటి జాగ్రత్త

    Archives

    November 2013
    October 2013
    September 2013
    August 2013
    May 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.