- కొన్ని కూరగాయలు ఎన్నో పోషకాలను అందిస్తాయి. కానీ వండే విధానాన్ని బట్టి కొన్నిసార్లు వాటిని కోల్పోవాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- క్యారెట్ లాంటి వాటిని ఉడికించి ముక్కలు కోయడం కన్నా.. ముందు ముక్కలు తరిగి తరవాత వేయించాలి. అప్పుడు వాటి నుంచి కెరొటినాయిడ్లనే యాంటీఆక్సిడెంట్లు విడుదల అవుతాయి. అవి క్యాన్సర్ కణాలను నశింపచేస్తాయి.
- ఆకు కూరల్ని వండేప్పుడు కొద్దిగా ఆలివ్‌నూనెను వేస్తే, అవి ఉడుకుతున్నప్పుడు అవసరమైన పోషకాలు పోవు.
- వెల్లుల్లిని తరిగి వెంటనే పోపులో వేయడం, పదార్థంలో వాడటం కాకుండా... ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. కాసేపు గాలికి ఉంచడం వల్ల వాటిల్లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పెరుగుతాయి.
- కొందరు బంగాళాదుంపల చెక్కు తీసేసి ఉడికిస్తుంటారు. అలా కాకుండా పొట్టుతో సహా ఉడికించడం వల్ల 'సి' విటమిన్ స్థాయి పెరుగుతుంది. అలాగే ఉడికించేప్పుడు ఆ గిన్నెపై మూత పెట్టాలి. దానివల్ల పోషకాలు తగ్గకుండా ఉంటాయి.
0 Comments
|