ఆ రోజు లక్ష్మి కూరగాయల మార్కెట్‌కు వె ళ్లింది. అక్కడ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కేజీ ఉల్లిపాయల ధర డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పలుకుతోంది. ఇక అల్లం, పచ్చిమిరపకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏ కూరగాయల ధరలు అడిగినా గుండెలదిరిపోతున్నాయి. తా ను తీసుకువచ్చిన డబ్బు దేనికీ సరిపోదని ఆమెకు అర్థమయింది. ఇక చేసేది లేక గబగబా మామూలు ధరలకు లభించే ఆకు కూరలు, కరివేపాకు, కొత్తిమీర వంటివి కొని ఇంటికి చేరింది. ఆ ధరలకుమల్లే ఆమె వొళ్లు కూడా మండింది. ఇంటికి చేరగానే చేతి సంచీని ఓమూలకు గిరాటేసి, నడుముకు కొంగు దోపుకుని వంటింట్లోకి దారితీసింది.
వంటింట్లో డబ్బాలు వెతగ్గా ఎప్పుడో తమ ఊరికి వెళ్లినప్పుడు తెచ్చుకున్న ఉలవలు కన్పించాయి. వెంటనే వాటి పనిబట్టింది. ఉలవల్ని నానబెట్టింది. తరువాత తగినంత కొబ్బరిపొడి, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి దంచి, చింతపండుతో ఉలవ చారు చేసింది. కొత్తిమీర వెయ్యటం మరచిపోలేదు. కరివేపాకు, పోపు వేసి చేసిన ఉలవ చారు ఘుమఘుమలాడుతోంది. తరువాత కొంత కందిపప్పు వేయించి ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి కంది పచ్చడి చేసింది. మిరియాలను ఉప్పులో వేసి దంచి కోడిగుడ్డు గిలక్కొట్టి ఆమ్లేట్ వేసింది. అంతే తప్ప ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల జోలికి వెళ్లనేలేదు. ఇక అప్పడాలు, వడియాలు వంటివి ఇంట్లో ఉండనే ఉన్నాయి. ఆ వేళ భోంచేస్తున్నప్పుడు తెగ మెచ్చుకుంటూ భర్త, పిల్లలు తృప్తిగా తినటం గమనించింది.
‘‘రోజూ వంట ఇలాగే చెయ్యి. ముద్దపప్పు, ఏవో కాయగూరలు వండి పడేసేదానివి. ఈవేళ వంట బాగా కుదిరిందోయ్..!’’- అని భర్త అంటుంటే ఆశ్చర్యానందాలలో ఆమె చూస్తూండిపోయింది.
మరుసటి రోజు షరా మామూలే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వెయ్యకుండానే గుప్పెడు శనగపప్పు నానబెట్టి కరివేపాకు, రెండు ఎండు మిరపకాయలు, పోపు దినుసులు నూనెలో వేసి తిరగమోత వేసి ఘుమఘుమలాడే ఉప్మా తయారుచేసింది. భర్త, పి ల్లలు ఎంతో బాగుందని ఎంతో మెచ్చుకుంటూ తిన్నారు.
ఇవే చిట్కాలను ఆమె తన ఫ్రెండ్స్‌కు చెప్పింది. వాళ్ళు కూడా తాము ఉల్లిపాయలు వంటి ఖరీదైన వాటి జోలికి పోవడం లేదని, వాటి ధరలు దిగే వరకూ కొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ధరలు మండు తున్న నేటి రోజుల్లో లక్ష్మిలాగే మనం కూడా కొన్ని చిట్కాలు పాటిస్తే డబ్బు ఆదా చేసే వీలుంది.
* టమాటాలు అధిక ధరలు పలుకుతున్నప్పుడు పప్పులాంటి వంటకాల్లో వాటికి బదులుగా ఏ చింతపండో, మామిడికాయో, చింతచిగురో వేస్తే వంట రుచికరంగా ఉంటుంది.
* కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలామంది పెరట్లో కరివేపాకు చెట్టుంటుంది. కాస్త చింతపండు, వెల్లుల్లి, కారప్పొడి లేదా ఎండు మిరపకాయలు, జీలకర్ర వేసి పచ్చడి చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
* పచ్చిపులుసు, మిరియాల చారు చేసే సమ యంలో ఖరీదైన పచ్చిమిర్చికి బదులుగా ఇంట్లో నిలవ వుంచుకున్న ఎండుమిరపకాయలు ఉపయోగించుకోవచ్చు. మాంసాహారులు ఉల్లిపాయలు, అల్లం ఉపయోగించకుండానే మటన్ లేదా చికెన్‌ను రుచికరంగా వండుకోవచ్చు. మొదట కుక్కర్‌లో మటన్ లేదా చికెన్‌తో పాటు కాస్త పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. నీళ్లు ఇగిరిపోయాక కావాల్సిన మేరకు మిరియాలు, వెల్లుల్లి అందులో వెయ్యాలి. కారం కోసం నాలుగైదు ఎండుమిరపకాయలు సరి పోతాయ. కొత్తిమీర సన్నగా తరిగివేసినా బాగుంటుంది. ఇష్టపడే రుచికి తగ్గట్టు వండుకోవచ్చు.
* పలావ్ చెయ్యాలన్నా ఓ నాలుగు యాలక్కాయలు, నూనె లేదా నెయ్యిలో నలగ్గొట్టి వేసి వేయించిన తరువాత ఎసరు పెట్టి వండుకోవచ్చు. రంగు రావాలంటే ఏ జిలేబీ కలరో, పసుపో వేసుకుంటే బాగుంటుంది.
‘ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు’-అని విచారించే బదులు, మనకు అందుబాటులో ఉన్న వాటితో పొదుపు పాటించేలా ఆహార పదార్థాలు వండుకునే వీలుంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి నేడు అధిక ధరలు పెట్టి ఏది కొనాలన్నా బాధగానే ఉంటుంది. తగిన ప్రత్యామ్నా య పద్ధతులను అనుసరించి, మనసు పెట్టి వండితే అందరికీ తృప్తిగా ఉంటుంది. పొదుపు మంత్రం పాటించి ప్రతి గృహిణి ఆర్థిక సమస్యల నుంచి సులువుగా గట్టెక్కవచ్చు.