పెరుగు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పెరుగు కేవలం ఆరోగ్యకరమే కాదు సౌందర్య సాధనం కూడా. రోజూ ఆహారంలో తీసుకోవడం వలన పెరుగు మన శరీరవ్యవస్థను చల్లగా ఉంచటమేకాక, జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో తోడ్పడుతుంది. పెరుగును ఏ రూపంలో ఆహారంగా తీసుకున్నా రుచిగానే ఉంటుంది. పెరుగును అలాగే తినడం ఇష్టం లేకపోతే వివిధ రకాలుగా ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కలిపిన పెరుగన్నం రుచి మనందరికీ తెలుసు. పెరుగును అన్నంలో తినడం నచ్చని వారు కూరల్లో, స్వీట్లలో, ఎలాగైనా వాడుకోవచ్చు. ఏదో రూపంలో పెరుగును ఆహారంలో తీసుకోవడం మంచిది. ఏవిధంగా తిన్నా దాని పోషకాలు, ఉపయోగాలు మనకు అందుతాయి. ఏవిధంగా పెరుగు మనకు ఉపయుక్తమో చూడండి.
- పెరుగు పాలతో తయారైనప్పటికీ పాల కన్నా ఎక్కువ కాల్షియం కలిగి ఉండి ఎముకలకు, పళ్ళకు బలాన్నిస్తుంది. ఎముకలను పెళుసుబారకుండా కాపాడుతుంది.
- కొంతమందికి పాలంటే వాసన నచ్చక తాగరు. కానీ, పాల వలన కలిగే ఉపయోగాలు పొందాలనుకుంటే పెరుగు పాలకు చక్కని ప్రత్యామ్నాయం.
- అజీర్ణంతో బాధపడ్తున్నా లేక కడుపులో ఇతర సమస్యలున్నా పెరుగు తింటే జీర్ణవ్యవస్థ చక్కబడుతుంది.
- రోజూ ఒక కప్పు పెరుగు తింటే, పెరుగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేయడం మాత్రమే కాదు, కాంతివంతంగా కూడా చేస్తుంది. పెరుగును ముఖానికి పూతలా వేసుకుంటే చర్మంపై ముడుతలు, మచ్చలు మాయం.
- పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. వారానికి ఒకసారి పెరుగును మాడుకు, జుట్టుకు రాసి 30 నిముషాల పాటు ఉంచితే జుట్టు మృదువుగా అవుతుంది. చుండ్రును దరి చేరనివ్వదు.
- పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు, ఇంకా వివిధ ఎంజైములు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఏవైనా హానికారక కెమికల్స్ శరీరంలోకి పొరబాటున వెళితే పెరుగు వాడకం వలన చాలా త్వరితంగా ఉపశమనం పొందవచ్చు.
- పెరుగులో ఎటువంటి కేలరీలు, కొవ్వు పదార్థాలు, చక్కెర లేకపోవడం వలన విరివిగా ఆహారంలో వివిధ రూపాలలో తీసుకోవచ్చు.ఆకలిగా ఉన్నప్పుడు జంక్‌ఫుడ్‌కు బదులు పెరుగును తీసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా పెరుగు ఉపయోగపడుతుంది.
- పెరుగు వినియోగం వలన మనం తీసుకునే ఇతర ఆహారపదార్థాల నుండి పోషకాలను, మినరల్స్‌ను గ్రహించే శక్తి పెంపొందుతుంది.
- రోగ నిరోధకశక్తిని మెరుగు పరచడంతో పాటు రక్తపోటు ముప్పునూ తగ్గిస్తుంది.