వాటర్ ఫిల్టర్ శుభ్రతకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవాలను కుంటున్నారా... అయితే ఈ కథనం చదవండి. మురికిగా వున్న నీటిని తాగడం వలన అనేక వ్యాధులు వస్తుంటాయి. అందుకోసం వాటర్ ఫిల్టర్ల ఉపయోగించడం ఉత్తమం. అలాగే వాటిని శుభ్రపరచడంలో జాగ్రత్త పడుతూ ఉండాలి.
- వాటర్ ఫిల్డర్ కొత్త క్యాండిల్ బిగించిన తర్వాత పిల్టర్ అయిన నీళ్ళు మట్టివాసన వస్తాయి. అందుచేత కొత్తక్యాండిల్ను బిగించబోయేముందు ఆ క్యాండిల్స్ నీళ్ళలో మునిగేటట్లుగా ఒకటి రెండు రోజులు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాతనే ఉపయోగించాలి.
- వారానికి రెండుమూడుసార్లు వాటర్‌ఫిల్టర్ క్యాండిల్స్‌ను శుభ్రం చేయాలి. లేకపోతే క్యాండిల్స్ మురికావడంతో పాటు క్యాండిల్స్ అమర్చిన డబ్బాలో అడుగున మట్టిచారలు పేరుకుని ఫిల్టర్ మురికి అవుతుంది.
- క్యాండిల్స్ బాగా నల్లగా అయి అవి మురికిపట్టి వున్నప్పుడు సబ్బుపొడి కలిపిన వేడినీళ్ళలో వాటిని నానబెట్టి ఆ తర్వాత మెత్తని పీచుతో తోమితే క్యాండిల్స్ శుభ్రపడతాయి. క్యాండిల్స్‌ను శుభ్రపరచటానికి ప్రత్యేకమైన బ్రష్‌ను ఉపయోగించడం మంచిది.