కావలసిన పదార్థాలు :
ఉల్లిపాయ - 1
టమాటాలు - 2
వంకాయలు - 4
సొరకాయ ముక్కలు - 1/2 కప్పు
మునక్కాయలు - 2
గుమ్మడికాయ ముక్కలు - 1/2 కప్పు
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
చింతపండు పులుసు - 1/2 కప్పు
ఉప్పు - తగినంత
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
నూనె - 4 టీ.స్పూ.
ఎండుమిర్చి - 3
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.
తయారుచేసే పద్ధతి :
టమాటాలు, వంకాయ, సొరకాయ, గుమ్మడికాయ, మునక్కాయలు అన్నీ ఒకే సైజులో ముక్కలు చేసుకోవాలి. పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కూరగాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు మగ్గిన తర్వాత కారం పొడి, తగినంత ఉప్పు, కప్పుడు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత పులుసు, గరం మసాలా వేసి కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. ఇది మరీ పలచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఉండాలి. చిన్న గరిట లేదా పాన్లో చెంచాడు నూనె వేడి చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఉడికిన పులుసులో వేసి, కొత్తిమీర చల్లి దింపేయాలి.