telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

వరుత్తరాచ సాంబార్

1/29/2014

0 Comments

 
Picture
కావలసినవి:
 కందిపప్పు - పావు కప్పు
 పసుపు - పావు టీ స్పూను
 పచ్చిమిర్చి - 4
 చిలగడదుంప ముక్కలు - అర కప్పు
 ఉల్లి తరుగు - అరకప్పు
 మునగకాడ - 1 (పెద్ద సైజు
 ముక్కలుగా కట్ చేయాలి)
 క్యారట్ - 1
 బెండకాయ ముక్కలు - అర కప్పు
 టొమాటో ముక్కలు - అర కప్పు
 వంకాయ - 1
 చింతపండు - నిమ్మకాయ సైజు పరిమాణంలో
 సాంబారు ఉల్లిపాయలు - 10
 కరివేపాకు - నాలుగు రెమ్మలు
 కొబ్బరితురుము - అర కప్పు
 మెంతుల పొడి - పావు టీ స్పూను
 ఇంగువ - పావు టీ స్పూను
 ధనియాల పొడి - 2 టేబుల్‌స్పూన్లు
 కారం - టీ స్పూను
 
 పోపుకోసం
 ఆవాలు - టీ స్పూను
 కొబ్బరినూనె - టేబుల్ స్పూను
 మినప్పప్పు - టీ స్పూను
 ఎండుమిర్చి - 2
 కరివేపాకు - రెండు రెమ్మలు
 
 తయారి:
  •  ఒక గిన్నెలో తగినంత నీరు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిలగడదుంప, క్యారట్, కీర, బెండ, వంగ, టొమాటో... ముక్కలు వేసి ఉడికించాలి.    
  •  కొద్దిగా ఉడికిన తరవాత మునగకాడలు, చింతపండు రసం వేయాలి.    
  •  కందిపప్పుకి తగినంత నీరు జత చేసి కుకర్‌లో ఉంచి, ఆరు విజిల్స్ వచ్చాక దించేయాలి.    
  •  బాణలిలో మెంతులపొడి వేసి కొద్దిగా వేయించి, తీసేయాలి.    
  •  అదే బాణలిలో కొబ్బరి తురుము, కరివేపాకు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి.     
  •  ధనియాలపొడి, కారం, ఇంగువ, మెంతులపొడి, పసుపు వేసి బాగా కలపాలి.    
  •  చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.    
  •  ఉడుకుతున్న కూరముక్కలలో ఈ పేస్ట్ వేసి కలిపి, బాగా మరిగాక దించేయాలి.    
  •  బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి సాంబార్‌లో వేసి కలపాలి.

0 Comments

ఉసిరి సాంబార్

1/8/2014

0 Comments

 
Picture
కావలసినవి:
 ఉసిరికాయలు - వందగ్రాములు,
 కందిపప్పు (ఉడికించి) - ఒక కప్పు, 
సాంబార్‌పొడి - రెండు టీస్పూన్లు, 
పసుపు - చిటికెడు, 
పచ్చిమిర్చి - రెండు, 
కరివేపాకులు - కొన్ని, 
ఆవాలు - ఒక టీస్పూన్, 
ఇంగువ - చిటికెడు, 
ఉప్పు, నూనె - సరిపడా.

తయారీ:
  •  ఉసిరికాయల్ని కడిగి గింజలు తీసి ముక్కలు కోయాలి.
  • పచ్చిమిర్చిని నిలువుగా చీల్చాలి.
  • గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి ఉసిరి ముక్కల్ని ఉడికించాలి. తరువాత సాంబార్ పొడి, పసుపు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి ఉడికించాలి.
  • ఉసిరి ముక్కలు ఉడకగానే వాటిని మెత్తగా మెదపాలి. తరువాత ఉడికించిన కందిపప్పు వేసి మళ్లీ ఉడికించాలి.
  • అన్ని పదార్ధాలు బాగా కలిసిపోయిన తరువాత గిన్నెను స్టవ్ మీద నుంచి కిందకు దింపాలి.
  • తాలింపుకు నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు సాంబార్‌లో ఆ తాలింపు వేస్తే ఉసిరి సాంబార్ రెడీ. 

0 Comments

టొమాటో కర్డ్ స్ల్యూ

12/14/2013

0 Comments

 
Picture
కావలసినవి
 బీన్‌కర్డ్ - కప్పు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది),

టొమాటో తరుగు - పావుకప్పు,
లవంగం - 1,
వెల్లుల్లి రెబ్బలు: 6,
కార్న్‌ఫ్లోర్ - అర టేబుల్ స్పూను,
పచ్చిబఠాణీ - పావు కప్పు (ఉడికించాలి),
నూనె - 3 టేబుల్ స్పూన్లు
 

 తయారి:  
  •  బీన్ కర్డ్‌ని అర అంగుళం ముక్కలుగా కట్ చేయాలి  
  •  టొమాటోలను శుభ్రంగా కడిగి ఉడికించి, తొక్క తీసి ముక్కలుగా కట్ చే యాలి  
  •  బాణలిలో నూనె వేసి కాగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉంచాలి  
  •  బీన్‌కర్డ్ ముక్కలు, వెల్లుల్లి తరుగు వే సి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి  
  •  చిన్నగిన్నెలో నీరు, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి టీ స్పూన్ నూనె వేసి, పై మిశ్రమంలో వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించి దింపేయాలి  
  •  బఠాణీలతో గార్నిష్ చేయాలి.

0 Comments

ఆమ్లా రైతా

11/23/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు - 8,
 కొబ్బరి తురుము - 2 స్పూన్స్, 
పచ్చిమిరకాయలు - 2,
పెరుగు - ఒక కప్పు, 
ఆవాలు - పావు టీ స్పూన్,
కరివేపాకు - 2 రెమ్మలు,
ఎండు మిరపకాయలు - 3,
నూనె, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం : 
  • ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలి. 
  • దీంట్లో ఉసిరికాయలను వేసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. అంతకంటే ఎక్కువసేపు ఉంటే ముక్కలు మరీ మెత్తగా అయిపోతాయి.
  • ఇప్పుడు ఉసిరికాయలను చిన్న, చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొన్ని ముక్కలను పక్కకు పెట్టేయాలి. మిగిలిన ముక్కల్లో కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  • ఒక గిన్నెలో పెరుగు తీసుకొని బాగా గిలక్కొట్టాలి. దీంట్లో ఉసిరికాయ పేస్ట్, ఉప్పు, మిగిలిన ఉసిరికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. 
  • ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసి.. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపును పెరుగుతో కలిపి పెట్టుకున్న ఉసిరి ముక్కల్లో వేయాలి. ఇంకేం.. ఆమ్లా రైతా రెడీ!

0 Comments

చె న్నై సాంబార్

11/10/2013

0 Comments

 
Picture
కావలసినవి:
  ఎర్ర కందిపప్పు - కప్పు;

మునగకాడ - 1 (ముక్కలుగా కట్ చేయాలి)
 చిన్న వంకాయలు - 10 (పొడవుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి);

టొమాటో తరుగు - పావు కప్పు;
పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేసుకోవాలి);
కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు
 ఉప్పు - తగినంత;

చింతపండు - కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి)
 
 పేస్ట్ కోసం:

పుట్నాలపప్పు - 2 టేబుల్ స్పూన్లు
 టొమాటో - 1 (పెద్దది);

కొబ్బరితురుము - టేబుల్ స్పూను;
సాంబారు పొడి - 4 టీ స్పూన్లు
 ఇంగువ - పావు టీ స్పూను;

ఆవాలు - పావు టీ స్పూను;
జీలకర్ర - టీ స్పూనుఛ
 మినప్పప్పు - టీ స్పూను;

ఎండుమిర్చి - 1;
కరివేపాకు - రెండు రెమ్మలు
 
 తయారి:  
  •  ఎర్ర కందిపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉంచి ఏడు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక, మెత్తగా మెదపాలి.    
  •  మిక్సీలో పుట్నాలపప్పు, టొమాటో, కొబ్బరితురుము, సాంబారు పొడి, ఇంగువ వేసి మెత్తగా పేస్ట్ చేస్తే సాంబార్ మసాలా రెడీ అవుతుంది.    
  •  ఒక గిన్నెలో మెదిపి ఉంచుకున్న పప్పు, నాలుగు కప్పుల నీరు, కూరముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి.    
  •  చింతపండు పులుసు వే సి మరిగించాలి.    
  •  బాగా మరిగాక, మెత్తగా చేసి ఉంచుకున్న సాంబార్ మసాలా వేసి బాగా కలిపి ఐదునిముషాలు ఉంచాలి.    
  •  వేరొక బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.    
  •  మధ్యలోకి నాలుగు ముక్కలుగా తరిగి ఉంచుకున్న వంకాయలను జత చేసి వేయించాలి.    
  •  ఉడుకుతున్న సాంబారులో వేసి, బాగా మరిగిన తరవాత దించేయాలి.

0 Comments

లస్సీ విత్ ఫ్లేక్స్

10/23/2013

0 Comments

 
Picture
కావలసినవి:
 పెరుగు - అరలీటరు,

అల్లం తురుము - పావు టీ స్పూను,
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను,
కార్న్‌ఫ్లేక్స్ - పావు కప్పు,
కరివేపాకు - రెండు రెమ్మలు,
కొత్తిమీర - కొద్దిగా,
క్రీమ్ - 3 టీ స్పూన్లు, ఉప్పు
 


  తయారి:  
  •  మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి  
  •  పెరుగు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి  
  •  ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి  
  •  గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి  
  •  వరుసగా కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్‌లను పైన వేసి సర్వ్ చేయాలి.

0 Comments

పచ్చిమామిడికాయ సాంబార్

10/1/2013

0 Comments

 
Picture
కావలసినవి:
 మామిడికాయ ముక్కలు - కప్పు
 కందిపప్పు - పావుకప్పు
 శనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
 పెసరపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
 ఉల్లితరుగు - అర కప్పు
 సాంబార్ పొడి - 2 టీ స్పూన్లు
 చింతపండు - కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి)
 బెల్లం తురుము - మూడు టేబుల్ స్పూన్లు
 కారం - కొద్దిగా
 ఉప్పు - తగినంత
 పసుపు - పావు టీ స్పూను
 ఆవాలు - అర టీ స్పూను
 మెంతులు - పావు టీ స్పూను
 జీలకర్ర - అర టీ స్పూను
 ఇంగువ - చిటికెడు
 ఎండుమిర్చి - 3
 కరివేపాకు - రెండు రెమ్మలు
 నూనె - 2 టేబుల్ స్పూన్లు
 
 తయారి:

  •  అన్ని పప్పులను శుభ్రంగా కడిగి, తగినంత నీరు పోసి కుకర్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దించేయాలి.    
  •  చల్లారాక మెత్తగా మాష్ చేయాలి.    
  •  బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.    
  •  ఉల్లితరుగు జత చేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి.    
  •  టొమాటో తరుగు, కొద్దిగా నీరు వేసి మూత పెట్టి మూడు నిముషాలు ఉంచాలి.    
  •  మెత్తగా చేసిన పప్పు, ఉప్పు, పసుపు, కారం, చింతపండురసం, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి.    
  •  మరుగుతుండగా సాంబార్ పొడి వేయాలి.

0 Comments

సాంబారు పొడి

9/30/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
కందిపప్పు - 100 గ్రా.
 ఎండుమిర్చి - 50 గ్రా.
 ధనియాలు - 50 గ్రా.
 శనగపప్పు - 25 గ్రా.
 మినప్పప్పు - 25 గ్రా.
 బియ్యం - 10 గ్రా.
 జీలకర్ర - 2 టీ స్పూన్లు
 మిరియాలు - టీ స్పూను
 ఎండుకొబ్బరి - రెండు టీ స్పూన్లు
 మెంతులు - టీ స్పూను
 పసుపు - చిటికెడు
 నూనె - టీ స్పూను
 ఉప్పు - కొద్దిగా
 
 తయారి:

బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక, పైన చెప్పిన పదార్థాలను విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. చల్లారాక కొద్దిగా ఉప్పు జత చేసి అన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

0 Comments

గుమ్మడి సాంబార్

9/26/2013

0 Comments

 
Picture
కావలసినవి:
 తీపిగుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు
 ఉల్లిపాయలు - మూడు;

చింతపండు - నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి);
పచ్చిమిర్చి - 6;
పసుపు - చిటికెడు;
ఉప్పు - తగినంత;
కారం - అర టీ స్పూను;
బియ్యప్పిండి - టీ స్పూను;
మెంతులు - ఐదారు గింజలు;
ఆవాలు - అర టీ స్పూను;
నూనె - టీ స్పూను;
కరివేపాకు - రెండు రెమ్మలు
ఇంగువ - చిటికెడు
 
 తయారి:   
  •  ఒక పాత్రలో గుమ్మడికాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, మెంతులు, నీరు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి, ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.  
  •  పసుపు, కారం, చింతపండు రసం, రెండు కప్పుల నీరు జత చేసి, బాగా కలపాలి.    
  •  ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీరు, బియ్యప్పిండి బాగా కలిపి, ఉడుకుతున్న సాంబార్‌లో వేసి పదినిముషాలు ఉంచాలి.    
  •  బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి, సాంబార్‌లో వేయాలి.    
  •  చివరగా సాంబార్ పొడి, కొత్తిమీర వేసి ఒక్క పొంగు రానిచ్చి దించేయాలి.

0 Comments

మిక్స్ వెజ్ పులుసు

9/23/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
ఉల్లిపాయ - 1
టమాటాలు - 2
వంకాయలు - 4
సొరకాయ ముక్కలు - 1/2 కప్పు
మునక్కాయలు - 2
గుమ్మడికాయ ముక్కలు - 1/2 కప్పు
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
చింతపండు పులుసు - 1/2 కప్పు
ఉప్పు - తగినంత
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
నూనె - 4 టీ.స్పూ.
ఎండుమిర్చి - 3
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.

తయారుచేసే పద్ధతి :
టమాటాలు, వంకాయ, సొరకాయ, గుమ్మడికాయ, మునక్కాయలు అన్నీ ఒకే సైజులో ముక్కలు చేసుకోవాలి. పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కూరగాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు మగ్గిన తర్వాత కారం పొడి, తగినంత ఉప్పు, కప్పుడు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత పులుసు, గరం మసాలా వేసి కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. ఇది మరీ పలచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఉండాలి. చిన్న గరిట లేదా పాన్లో చెంచాడు నూనె వేడి చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఉడికిన పులుసులో వేసి, కొత్తిమీర చల్లి దింపేయాలి.


0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    June 2013
    May 2013

    Categories

    All
    చె న్నై సాంబార్
    రైతా
    రాగి సరిగ
    బూందీ రైతా
    ఆమ్లా రైతా
    లస్సీ విత్ ఫ్లేక్స్
    ఉసిరి సాంబార్
    ఉసిరి సాంబార్
    మిక్స్ వెజ్ పులుసు
    సొరకాయ రైతా
    టొమాటో కర్డ్ స్ల్యూ
    గుమ్మడి సాంబార్
    వరుత్తరాచ సాంబార్
    పచ్చిమామిడికాయ సాంబార్

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.