కావలసినవి:
ఎర్ర కందిపప్పు - కప్పు;
మునగకాడ - 1 (ముక్కలుగా కట్ చేయాలి)
చిన్న వంకాయలు - 10 (పొడవుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి);
టొమాటో తరుగు - పావు కప్పు;
పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేసుకోవాలి);
కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు
ఉప్పు - తగినంత;
చింతపండు - కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి)
పేస్ట్ కోసం:
పుట్నాలపప్పు - 2 టేబుల్ స్పూన్లు
టొమాటో - 1 (పెద్దది);
కొబ్బరితురుము - టేబుల్ స్పూను;
సాంబారు పొడి - 4 టీ స్పూన్లు
ఇంగువ - పావు టీ స్పూను;
ఆవాలు - పావు టీ స్పూను;
జీలకర్ర - టీ స్పూనుఛ
మినప్పప్పు - టీ స్పూను;
ఎండుమిర్చి - 1;
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి:
ఎర్ర కందిపప్పు - కప్పు;
మునగకాడ - 1 (ముక్కలుగా కట్ చేయాలి)
చిన్న వంకాయలు - 10 (పొడవుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి);
టొమాటో తరుగు - పావు కప్పు;
పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేసుకోవాలి);
కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు
ఉప్పు - తగినంత;
చింతపండు - కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి)
పేస్ట్ కోసం:
పుట్నాలపప్పు - 2 టేబుల్ స్పూన్లు
టొమాటో - 1 (పెద్దది);
కొబ్బరితురుము - టేబుల్ స్పూను;
సాంబారు పొడి - 4 టీ స్పూన్లు
ఇంగువ - పావు టీ స్పూను;
ఆవాలు - పావు టీ స్పూను;
జీలకర్ర - టీ స్పూనుఛ
మినప్పప్పు - టీ స్పూను;
ఎండుమిర్చి - 1;
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి:
- ఎర్ర కందిపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉంచి ఏడు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక, మెత్తగా మెదపాలి.
- మిక్సీలో పుట్నాలపప్పు, టొమాటో, కొబ్బరితురుము, సాంబారు పొడి, ఇంగువ వేసి మెత్తగా పేస్ట్ చేస్తే సాంబార్ మసాలా రెడీ అవుతుంది.
- ఒక గిన్నెలో మెదిపి ఉంచుకున్న పప్పు, నాలుగు కప్పుల నీరు, కూరముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి.
- చింతపండు పులుసు వే సి మరిగించాలి.
- బాగా మరిగాక, మెత్తగా చేసి ఉంచుకున్న సాంబార్ మసాలా వేసి బాగా కలిపి ఐదునిముషాలు ఉంచాలి.
- వేరొక బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
- మధ్యలోకి నాలుగు ముక్కలుగా తరిగి ఉంచుకున్న వంకాయలను జత చేసి వేయించాలి.
- ఉడుకుతున్న సాంబారులో వేసి, బాగా మరిగిన తరవాత దించేయాలి.