
కావలసిన పదార్థాలు :
సొరకాయ తురుము - ఒకటిన్నర కప్పు,
పెరుగు - ఒక కప్పు,
ఉప్పు - ఒక టీస్పూన్,
కారం - పావు టీస్పూన్,
జీలకర్ర (వేగించి, పొడికొట్టి)- అర టీస్పూన్.
తయారుచేసే పద్ధతి :
- పెరుగుని ఒక గిన్నెలో తీసుకుని బాగా గిలక్కొట్టాలి.
- సొరకాయ తురుమును కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి.
- పెరుగులో ఉప్పు వేసి కలిపి ఆ తరువాత ఉడికించిన సొరకాయ గుజ్జును కలపాలి. దీనిపైన కారం, జీలకర్ర పొడి వేసి అలంకరించి సర్వ్ చేయాలి. తాలింపు వేసుకుని తిన్నా రుచిగానే ఉంటుంది.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక