కావలసినవి:
తీపిగుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు
ఉల్లిపాయలు - మూడు;
చింతపండు - నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి);
పచ్చిమిర్చి - 6;
పసుపు - చిటికెడు;
ఉప్పు - తగినంత;
కారం - అర టీ స్పూను;
బియ్యప్పిండి - టీ స్పూను;
మెంతులు - ఐదారు గింజలు;
ఆవాలు - అర టీ స్పూను;
నూనె - టీ స్పూను;
కరివేపాకు - రెండు రెమ్మలు
ఇంగువ - చిటికెడు
తయారి:
తీపిగుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు
ఉల్లిపాయలు - మూడు;
చింతపండు - నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి);
పచ్చిమిర్చి - 6;
పసుపు - చిటికెడు;
ఉప్పు - తగినంత;
కారం - అర టీ స్పూను;
బియ్యప్పిండి - టీ స్పూను;
మెంతులు - ఐదారు గింజలు;
ఆవాలు - అర టీ స్పూను;
నూనె - టీ స్పూను;
కరివేపాకు - రెండు రెమ్మలు
ఇంగువ - చిటికెడు
తయారి:
- ఒక పాత్రలో గుమ్మడికాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, మెంతులు, నీరు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి, ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.
- పసుపు, కారం, చింతపండు రసం, రెండు కప్పుల నీరు జత చేసి, బాగా కలపాలి.
- ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీరు, బియ్యప్పిండి బాగా కలిపి, ఉడుకుతున్న సాంబార్‌లో వేసి పదినిముషాలు ఉంచాలి.
- బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి, సాంబార్‌లో వేయాలి.
- చివరగా సాంబార్ పొడి, కొత్తిమీర వేసి ఒక్క పొంగు రానిచ్చి దించేయాలి.