* నల్లమిరియాల్ని కొన్ని శతాబ్దాలుగా గ్యాస్ట్రో ఇంటస్టయినల్ సమస్యల్ని తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. వీటిలో ఉండే పెపరీన్ కొవ్వుతో ఫైట్ చేస్తుంది. కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుపడుతుంది.
* కొవ్వు కరిగించి, బరువు తగ్గించే మరో మసాలా దినుసు దాల్చిన చెక్క. బరువు తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది ఇది.
* జీలకర్ర రుచి గురించి కంటే ఇందులో ఉండే ఔషధగుణాల గురించి మాట్లాడుకోవాలి. ఇది రక్తహీనత, మొలలు, మతిమరుపు, నిద్రలేమి వంటి సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. భోజనంలో లేదా భోజనం తరువాత దీన్ని తింటే రక్తం శుభ్రపడుతుంది. జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. బరువు తగ్గుతారు.
* కొవ్వు త్వచాలు కొత్త రక్తనాళాల పెరుగుదలను అడ్డుకోకుండా అల్లం అడ్డుపడుతుంది. అంటే ఊబకాయాన్ని అరికట్టడంలో బాగా పనిచేస్తుందన్నమాట. దీంతోపాటు కొవ్వు కరిగించే గుణం, జీవక్రియలను వేగవంతం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి.
* పసుపులో ఉండే కర్‌క్యుమిన్ అనేది యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. ఈ గుణాలు రక్తనాళాల పెరుగుదలకు అడ్డుపడే కొవ్వు త్వచాలు విస్తరించకుండా అరికడతాయి. అచ్చం అల్లంలాగానే ఇది కూడా పనిచేస్తుంది. బరువు పెరగకుండా అరికడుతుంది.