- అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
- కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
- నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
- గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
- అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
- జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
- బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
- సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
- మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
- బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
- మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
- దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
- ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
- అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
- కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
- మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
- ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
- బీట్ రూట్ రసం 'లో బీపీ ' సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
- క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
- మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
- ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
- అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
- పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
- సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
- దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
- ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
- చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
- కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
- క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
- యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
- వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
- పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
- ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
- ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
- ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
- జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
- నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
- మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
- మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
0 Comments
ఇస్నోఫీలియాతో బాధపడేవారు..
రోజూ పడుకోబోయే ముందు రెండు చుక్కల లావెండర్ ఆయిల్ ను దిండుపై వేసుకొని పడుకోవాలి. చెవిపోటుగా ఉన్నప్పుడు హెయిర్ డ్రయర్ తీసుకొని ఫ్యాన్ ను తక్కువ స్థాయిలో పెట్టుకొని చెవి చుట్టూ ఆ గాలిని పట్టిస్తుంటే చెవిపోటు నుండి రిలీఫ్ వస్తుంది.
మలబద్దకంతో బాధపడేవారు..
రొజూ పడుకోబోయే ముందు రెండు పైనాపిల్ స్లైసులను తింటే ఉదయానే మలబద్దకం సమస్య ఉండదు. దగ్గుతో బాధపడేవారు..
గార్లిక్ లెమన్ టీ త్రాగితే త్వరగా ఉపశమనం వస్తుంది. ఒక వెల్లుల్లి రెబ్బను చితగ్గొట్టి నిమ్మరసం పిండి ఈ మిశ్రమాన్ని ఒక గంట తర్వాత ఒక కప్పు నీటిలో వేసి మరిగించి చల్లార్చి ఒక టీస్పూన్ తేనె కలుపుకొని త్రాగాలి. అజీర్ణంతో బాధపడేవారు.. జింజర్ తీ త్రాగితే చాలా మంచిది. ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని వేసి మరగించిన తర్వాత వేడివేడిగా పరగడుపున త్రాగితే అజీర్ణం సమస్య ఉండదు.
పావుకప్పు ఆవపిండిలో ఆరు టేబుల్ స్పూన్లు ఏదైనా పిండి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఒక పలుచని వస్త్రాన్ని తీసుకొని వేడినీటిలో నానబెట్టి ఈ పేస్ట్ ను వస్త్రంపై పరిచి మిగతా క్లాత్ ను కవర్ చేసి ఈ క్లాత్ ను ఛాతిపై పెట్టుకొని ఒక టవల్ ను దానిపై కవర్ చేసి పడుకోవాలి. ఇది నిమోనియా పేషెంట్స్ కి మంచి చిట్కా.
పొత్తి కడుపులో విపరీతమైన నొప్పిగా ఉంటే..
ఒక టవల్ తీసుకొని దానిపై ఆముదం రాసి ఆ టవల్ ను పొత్తి కడుపుపై వేసుకొని దానిపై హీటింగ్ ప్యాడ్ పెట్టుకుంటే ఎంతో ఉపశమనం వస్తుంది. ఈ టవల్ ను రిఫ్రిజిలేటర్ లో దాచిపెట్టి మరలా ఎప్పుడైనా నొప్పి వచ్చినపుడు వాడుకోవచ్చు. గోళ్ళు బీటలు వారుతుంటే..
ప్రతి రొజూ పడుకోబోయే ముందు గోళ్ళకు నువ్వుల నూనె రాసుకొని పడుకోవాలి. కాలిన గాయాలకు కలబంద గుజ్జును రాస్తే మంట తగ్గడమే కాకుండా కాలిన గాయం కూడా త్వరగా నయం అవుతుంది.
|