జంక్ ఫుడ్‌లో ఏముంటాయో చూడండి
ఇంట్లో వండిన ఆహారంతో పోలిస్తే ,
అధికంగా కొవ్వు
ఎక్కువ ఉప్పు శాతం
ఎక్కువ చక్కెర శాతం
తక్కువ పీచు పదార్థం
చాలా తక్కువ స్థాయిలో కాల్షియం, ఐరన్ లాటి పోషకాలు
ఇలా అలవాటు చేసుకోండి
- కూల్‌డ్రింక్స్‌కు బదులు మంచినీరు ఎక్కువ తీసుకోండి. చక్కెర శాతం ఉన్న నానారకాలైన పానీయాల కంటే నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది.
- ఇంట్లో ఉన్నప్పుడు, టీవీ చూస్తూనో, కంప్యూటర్ ముందు కూర్చునో చిప్స్ వంటి స్నాక్స్ తినడం కన్నా ఇంట్లో రక రకాల పండ్లను నిలువ పెట్టుకుని, జంక్‌ఫుడ్ బదులు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి.
- ఉదయంపూట ఎట్టి పరిస్థితులలో బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండకూడదు.విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తింటే జంక్‌ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది.
- ఇంట్లో వండే సాంప్రదాయ వంటలే కాక పోషక విలువలు కలిగిన మీకు నచ్చిన వంటకాలు తయారుచేసుకుని తినడం వలన కూడా జంక్ జోలికి వెళ్ళకుండా ఆపవచ్చు.
- ఎప్పుడూ తినే జంక్‌ఫుడ్ ఔట్‌లెట్స్ మార్చి, ఆరోగ్యకరమైన ఆహారం దొరికేచోటును ఎంచుకోవడానికి స్నేహితులను ఒప్పించండి.
- ఫ్రెండ్స్‌తో టైమ్‌పాస్ చేయడానికి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు కాకుండా వేరే అనువైన ప్రదేశాలు ఎంచుకోవడం వల్ల అనవసరంగా జంక్‌ఫుడ్‌ను తీసుకోకుండా ఆపచ్చు.
- స్కూల్, లేదా క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడి, జంక్ ఆహారం బదులు హెల్దీ స్నాక్స్ అమ్మేలా చూడాలి,
- సూపర్‌మార్కెట్ నుండి కొనే సరుకుల్లో ప్రాసెస్డ్‌ఫుడ్ ఇంటికి తేకుండా ఉండేలా నియమం పెట్టుకోవాలి.
ఆలోచనా తీరు మారాలి
- ఆరోగ్యకరమైన ఆహారం చాలా ఖరీదు ఎక్కువై ఉంటుందనుకుంటాం. అది నిజం కాదు. జంక్ ఆహారపు ధరను ఇతర ఆరోగ్యకరమైన ఆహారంతో పోల్చి చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది.
- ఆరోగ్యకరమైన ఆహారం రుచి లేకుండా ఉంటుందనుకుంటాం. కానీ పోషక విలువలు కలిగిన ఆహారం కూడా రుచికరంగా తయారుచేసుకోవచ్చు.
- ఆరోగ్యకరమైన ఆహారం అంటే కేవలం పండ్లు, ఎక్కువ ధర కలిగిన కూరగాయలు మాత్రమే కాదు, తృణధాన్యాలు, ఆకుకూరలు, జామ, ఉసిరి, నేరేడు వంటి ఎన్నో తక్కువధరకే దొరికే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు ఉన్నాయి.
తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి
- జంక్‌ఫుడ్ తీసుకునే టీనేజర్లు, జంక్‌ఫుడ్ తీసుకోని వారికంటే అధిక బరువు కలిగి ఉండే అవకాశం ఉంది.
- జంక్‌ఫుడ్ తినడం అలవాటు మొదలైతే ఒక వ్యసనం లాగా పట్టి పీడిస్తుంది. చురుకుదనం తగ్గిపోయి మందకొడితనం ఏర్పడుతుంది.
- ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్ల వలన ఎదుగుతున్న వయస్సులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్ వంటి పోషక పదార్ధాలు అందడంతో జ్ఞాపకశక్తి పెంపొంది, అన్నింటా ముందు నిలుస్తారు.