వెల్లుల్లి : మనం సాధారణంగా చిన్నచిన్న గాయాలకు ఆయింట్మెంట్లు వాడుతుంటాం. వెల్లుల్లి రెబ్బను చితక్కొట్టి గాయంపై రుద్దితే బాక్టీరియా దరిచేరకుండా నిరోధించవచ్చు. ఇన్ఫెక్షన్లు కూడా సోకవు. మన శరీర తత్వానికి వెల్లుల్లి సరిపడుతుందో లేదో ముందుగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. డయేరియా, అధిక రక్తపోటు వంటి సమస్యలను వెల్లుల్లి వినియోగంతో అదు పులో ఉంచుకోవచ్చు.
అల్లం : కొందరు బస్సుల్లో ప్రయాణి స్తున్నప్పుడు వాంతులు చేసుకోవడం, కళ్ళు తిరిగినట్లు అనిపించడం వంటి సమస్య లతో బాధపడుతుంటారు. అందువల్ల ప్రయా ణాలంటేనే వారు భయపడిపోతుంటారు. ఇలాంటివారు ప్రయాణానికి అరగంటలోపు టేబుల్ స్పూన్ అల్లం మిశ్రమాన్ని తీసు కోవాలి. వేడివల్ల వచ్చే అనారోగ్యాలను దూరం చేయడంలో ఇది ఉపయోగపడు తుంది. కడుపులో మంట ఉన్నా, దురదతో బాధపడుతున్నా, ఉదయంపూట వికారంగా ఉన్నా ఈ చిట్కాను పాటిస్తే ఫలితం ఉంటుంది.
ధనియాలు : బిజీగా ఉండే జీవన విధానం కారణంగా సరైన సమయంలో సరైన ఆహారం తీసుకునే వీలు చాలా మందిలో ఉండటం లేదు. ఇందువల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఇందువల్ల ఆహారం జీర్ణం కాకపోవడంతో పాటు ఇతర రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యతో బాధపడుతున్నవారు దీనిని అధిగమించడానికి ధనియాలతో చేసిన కషాయం త్రాగాలి. నెలసరి సమస్యలకు, రక్తహీనత నివారణకు, కాలేయం పనితీరు సక్రమంగా ఉండేలా చూడటంలో ధని యాలు కీలక పాత్ర పోషిస్తాయి.