తీపి పదార్థాలకు రుచినీ, సువాసననూ ఇచ్చే యాలకులు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలున్నప్పుడు యాలకుల్ని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూడాలి. ఇవి అల్లంలా పని చేసి, ఆ సవుస్యల్ని తగ్గిస్తాయి. వికారం, కడుపుబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడూ వీటి వాడకం మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో దీన్ని మించిన సుగంధ దినుసు లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. నోటి దుర్వాసనను తగ్గించడమే కాదు... నోట్లో అల్సర్లూ, ఇన్ఫెక్షన్ల లాంటివి ఉన్నప్పుడు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే... ఆ సమస్యలు తగ్గిపోతాయి. యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. జలుబూ, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడూ యాలకులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుతాయి.
నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.