కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు - 8,
కొబ్బరి తురుము - 2 స్పూన్స్,
పచ్చిమిరకాయలు - 2,
పెరుగు - ఒక కప్పు,
ఆవాలు - పావు టీ స్పూన్,
కరివేపాకు - 2 రెమ్మలు,
ఎండు మిరపకాయలు - 3,
నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
ఉసిరికాయలు - 8,
కొబ్బరి తురుము - 2 స్పూన్స్,
పచ్చిమిరకాయలు - 2,
పెరుగు - ఒక కప్పు,
ఆవాలు - పావు టీ స్పూన్,
కరివేపాకు - 2 రెమ్మలు,
ఎండు మిరపకాయలు - 3,
నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
- ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలి.
- దీంట్లో ఉసిరికాయలను వేసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. అంతకంటే ఎక్కువసేపు ఉంటే ముక్కలు మరీ మెత్తగా అయిపోతాయి.
- ఇప్పుడు ఉసిరికాయలను చిన్న, చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొన్ని ముక్కలను పక్కకు పెట్టేయాలి. మిగిలిన ముక్కల్లో కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- ఒక గిన్నెలో పెరుగు తీసుకొని బాగా గిలక్కొట్టాలి. దీంట్లో ఉసిరికాయ పేస్ట్, ఉప్పు, మిగిలిన ఉసిరికాయ ముక్కలు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసి.. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపును పెరుగుతో కలిపి పెట్టుకున్న ఉసిరి ముక్కల్లో వేయాలి. ఇంకేం.. ఆమ్లా రైతా రెడీ!