కావలసినవి:
కందిపప్పు - పావు కప్పు
పసుపు - పావు టీ స్పూను
పచ్చిమిర్చి - 4
చిలగడదుంప ముక్కలు - అర కప్పు
ఉల్లి తరుగు - అరకప్పు
మునగకాడ - 1 (పెద్ద సైజు
ముక్కలుగా కట్ చేయాలి)
క్యారట్ - 1
బెండకాయ ముక్కలు - అర కప్పు
టొమాటో ముక్కలు - అర కప్పు
వంకాయ - 1
చింతపండు - నిమ్మకాయ సైజు పరిమాణంలో
సాంబారు ఉల్లిపాయలు - 10
కరివేపాకు - నాలుగు రెమ్మలు
కొబ్బరితురుము - అర కప్పు
మెంతుల పొడి - పావు టీ స్పూను
ఇంగువ - పావు టీ స్పూను
ధనియాల పొడి - 2 టేబుల్స్పూన్లు
కారం - టీ స్పూను
పోపుకోసం
ఆవాలు - టీ స్పూను
కొబ్బరినూనె - టేబుల్ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
ఎండుమిర్చి - 2
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి:
కందిపప్పు - పావు కప్పు
పసుపు - పావు టీ స్పూను
పచ్చిమిర్చి - 4
చిలగడదుంప ముక్కలు - అర కప్పు
ఉల్లి తరుగు - అరకప్పు
మునగకాడ - 1 (పెద్ద సైజు
ముక్కలుగా కట్ చేయాలి)
క్యారట్ - 1
బెండకాయ ముక్కలు - అర కప్పు
టొమాటో ముక్కలు - అర కప్పు
వంకాయ - 1
చింతపండు - నిమ్మకాయ సైజు పరిమాణంలో
సాంబారు ఉల్లిపాయలు - 10
కరివేపాకు - నాలుగు రెమ్మలు
కొబ్బరితురుము - అర కప్పు
మెంతుల పొడి - పావు టీ స్పూను
ఇంగువ - పావు టీ స్పూను
ధనియాల పొడి - 2 టేబుల్స్పూన్లు
కారం - టీ స్పూను
పోపుకోసం
ఆవాలు - టీ స్పూను
కొబ్బరినూనె - టేబుల్ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
ఎండుమిర్చి - 2
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి:
- ఒక గిన్నెలో తగినంత నీరు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిలగడదుంప, క్యారట్, కీర, బెండ, వంగ, టొమాటో... ముక్కలు వేసి ఉడికించాలి.
- కొద్దిగా ఉడికిన తరవాత మునగకాడలు, చింతపండు రసం వేయాలి.
- కందిపప్పుకి తగినంత నీరు జత చేసి కుకర్లో ఉంచి, ఆరు విజిల్స్ వచ్చాక దించేయాలి.
- బాణలిలో మెంతులపొడి వేసి కొద్దిగా వేయించి, తీసేయాలి.
- అదే బాణలిలో కొబ్బరి తురుము, కరివేపాకు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి.
- ధనియాలపొడి, కారం, ఇంగువ, మెంతులపొడి, పసుపు వేసి బాగా కలపాలి.
- చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
- ఉడుకుతున్న కూరముక్కలలో ఈ పేస్ట్ వేసి కలిపి, బాగా మరిగాక దించేయాలి.
- బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి సాంబార్లో వేసి కలపాలి.