
కావలసిన పదార్థాలు :
బియ్యం నూకలు - రెండు కప్పులు
రాగి పిండి - ఒకటిన్నర కప్పు
పెరుగు - అరకప్పు
ఉల్లిపాయ - ఒకటి (పెద్దది)
పచ్చిమిరపకాయలు - మూడు
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
మూలం : సాక్షి దినపత్రిక
బియ్యం నూకలు - రెండు కప్పులు
రాగి పిండి - ఒకటిన్నర కప్పు
పెరుగు - అరకప్పు
ఉల్లిపాయ - ఒకటి (పెద్దది)
పచ్చిమిరపకాయలు - మూడు
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- ముందుగా ఒక పాత్రలో రాగిపిండి తీసుకొని అందులో నీళ్ళు కలిపి సుమారు 12 గంటల సేపు ఊరబెట్టాలి. రాగిపిండి జావ బాగా పులవాలి.
- తర్వాత నూకలు శుభ్రం చేసుకొని అందులో ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద ఉడికించాలి. అర్ధ భాగం ఉడికిన తర్వాత పులిసి ఉన్న రాగి పిండిని జావాను అందులో పోయాలి. తర్వాత మరో పది నిముషాలు ఉడికించాలి.
- చల్లారిన తర్వాత కావలసినన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా ఆ జావలో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు చేర్చుకోవాలి. అంతే రాగి సరిగ రెడీ.
- ఇది వేసవి తాపాన్ని తీరుస్తుంది. ఇందులో కారం కావాలనుకునే వారు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. శీతల పానీయాలకంటే సాంప్రదాయబద్దమైనది. చిన్నారులకు ఈ సరిగ ఆకలి తీర్చడమే కాకుండా మంచి శక్తిని ఇస్తుంది. ఇది తెలుగింటి వేసవి స్పెషల్.
మూలం : సాక్షి దినపత్రిక