ఇవే కాకుండా మరికొన్ని రకాల తిండి వల్ల కూడా 'డి' విటమిన్‌ను పెంచుకోవచ్చు.
- రెండ్రోజులకు ఒకసారి చేప తింటే మంచిది. సాల్మన్, టునా వంటి చేపల్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ చేపలు మనకు దొరక్కపోయినా ఫర్వాలేదు. సాధారణ చేపల్ని తిన్నా ఈ ఫలితం లభిస్తుంది.
- పుట్టగొడుగులతో కూడా 'డి'ని పొందవచ్చు.
- ఆరంజ్‌జ్యూస్‌లోనూ ఈ రకమైన విటమిన్ దొరుకుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.
- అందరికీ అందుబాటులో ఉండే గుడ్డు కూడా ఇందుకు ఉపకరిస్తుంది.
- మాంసం తీసుకునేవాళ్లయితే.. లివర్ తింటే మంచిది.