- - చెయ్యి తెగి లేదా దెబ్బ తగిలి రక్తం వస్తున్నప్పుడు చల్లని ఫ్రిజ్ వాటర్‌తో ఆ భాగాన్ని నెమ్మదిగా కడగండి. రక్తం ఆగిపోతుంది.
- - తలుపు సందులోనో లేదా మూతవేసేటప్పుడో చేతివేలు పడి నలిగి, నల్లగా రక్తం పేరుకుని చాలా బాధ కలుగుతుంది. ఆ ప్రదేశంలో ధారగా ఐస్‌వాటర్ పోయండి. ఇంకా బాధ తగ్గకుంటే వేలును రెండు నిమిషాలు డీప్‌ఫ్రిజ్‌లో పెట్టి ఉంచండి. బాధ తగ్గుతుంది. నల్లమచ్చపోతుంది.
- - ఒంటి నొప్పులకు, బెణుకులకు వేడినీటి కాపడం పెట్టినట్లుగానే ఐసుముక్కలను ఒక గుడ్డలో వేసి కాపడం పెట్టండి. బాధలు త్వరగా తగ్గుతాయి. రోగికి ఇష్టంగా కూడా ఉంటుంది.