telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

ఆలు తినేందుకు ఐదు కారణాలు...

9/24/2013

0 Comments

 
Picture
                        'డైటింగ్‌లో ఉన్న వాళ్లు ఆలూని ఆమడ దూరంలో ఉంచాలి', 'డయాబెటిక్ ఉన్న వాళ్లు దాని పేరే ఎత్తకూడదు' అని చాలాసార్లు చదివే ఉంటారు. అయితే ఆ అభిప్రాయాన్ని మెదడులో పూడ్చి పెట్టేసి ఈ విషయాన్ని ఒకసారి చదవండి. "పలు కారణాల వల్ల 'సే నో టు పొటాటో' అనే వాళ్లందరూ పోషక విలువల్ని చేతులారా దూరం చేసుకుంటున్నట్టే. సరైన పద్ధతిలో తింటే ఆలు వల్ల జరిగే మేలే ఎక్కువ'' అంటున్నారు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషి ఖోస్లా.

                      "రోజుకి 40 గ్రాముల ఆలూని రెండో ఆలోచన లేకుండా తినొచ్చు. కాకపోతే తీసుకునే డైట్‌ని బట్టి ఈ కొలతలో కాస్త తేడా ఉంటుంది. బరువు పెరుగుతామని, డయాబెటిస్ ఉందని ఆలు తినకూడదనుకోవడం అపోహ మాత్రమే. ఆలుని ఎందుకు తినాలో చెప్పేందుకు నా దగ్గర ఐదు కారణాలున్నాయి. వాటిని చెప్పేముందు వంద గ్రాముల ఆలులో ఏమేమి ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. 97 కిలో కాలరీల శక్తి, 1.6 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. కొవ్వు 0.1, కార్బొహైడ్రేట్‌లు - 22.6, ఐరన్ 0.48 మిల్లీగ్రాములు, విటమిన్ సి 17 మిల్లీగ్రాములు, పీచు 0.4 గ్రాములు ఉంటుంది.

ఆలు తినేందుకు ఐదు కారణాలు...
  •  - ఆలు అధిక పోషకాల్ని కలిగి ఉండడమే కాకుండా. సహజ శక్తిని అందిస్తుంది. సంక్లిష్ట కార్బొహైడ్రేట్‌ల (స్టార్చ్)ని అధికంగా కలిగి ఉంటుంది. ఆలులో తేలికగా శోషణమయ్యే కార్బొహైడ్రేట్‌లు ఉంటాయి. ఒకే బరువు ఉన్న బ్రెడ్‌తో పోలిస్తే ఆలూలో కార్బొహైడ్రేట్ రెండింతలు తక్కువగా ఉంటుంది. మినరల్స్, బి గ్రూప్ విటమిన్లు, బీటాకెరోటిన్, విటమిన్-సిలతో పాటు నాణ్యమైన ప్రొటీన్లతో నిండి ఉంటుంది ఆలు. ఇందులో ప్రొటీన్ ఏడు శాతం ఉండడమే కాకుండా ప్రొటీన్ల నిర్మాణానికి అవసరమైన అమినో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరం తనంతట తానుగా తయారుచేసుకోలేనివి.
  • - ఆలూని ఉడికించిన పద్ధతి బట్టే కొవ్వు తయారవుతుంది. ఆలూని నూనెలో వేగించినపుడు, గ్రేవీల్లో వేసి ఉడికించినపుడు లేదా వెన్న, మీగడ వంటి వాటితో కలిపినప్పుడు మాత్రమే కొవ్వు పదార్థాల్ని ఉత్పత్తి చేస్తుంది. అదే ఆలూని విడిగా ఉడికించుకుని తింటే కొవ్వు ఊసే ఉండదు.
  • - ఆలూ తినడం వల్ల హైపర్‌టెన్షన్ (అధిక రక్త పీడన సమస్యల్ని) తగ్గుతుంది. అరటిపండ్లతో పోలిస్తే ఆలూలో పొటాషియం మెండుగా ఉంటుంది. సోడియం చాలా తక్కువ ఉంటుంది. బ్రెడ్, అన్నంలతో పోలిస్తే ఆలూలో రక్తంలో చక్కెర శాతాన్ని పెంచే గుణం చాలా తక్కువ. అందుకని మధుమేహులు కూడా ఆలూని చక్కగా లాగించేయొచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆలూని తినాలనుకున్నప్పుడు మీరు తీసుకునే ఆహారంలో తక్కువ కాలరీలు ఉండే ఇతర పదార్థాలు చూసుకోవాలి.
  • - పచ్చి బంగాళాదుంప రసంలో ఔషధ విలువలు మెండుగా ఉన్నాయి. ఈ రసం తాగితే జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తవు. అజీర్ణం, అల్సర్లు, కాలేయ సంబంధిత వ్యాధులు, మూత్రాశయంలో రాళ్లు, మల బద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ఆలు మంచి యాంటాసిడ్‌గా పనిచేస్తుంది.
  • - విటమిన్ సి, బి6, ఐరన్, విటమిన్ల ప్యాకేజి ఆలు. ఇందులో యాంటాక్సిడెంట్‌లు కూడా బాగానే ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను మరమ్మత్తు చేయడమే కాకుండా నాశనం కాకుండా కాపాడతాయి కూడా'' అని చెప్పారు ఇషి.

ఆరోగ్యంగా తినేందుకు

ఆరోగ్యకరమైన పద్ధతిలో ఆలుని ఎలా తినాలి... అని ఆలోచిస్తున్నారా. అందుకు కొన్ని సూచ నలు చేశారు న్యూట్రిషనిస్ట్ రాఖీ.
  • -ఆలుని నూనె, వెన్నల్లో వేసి లేదా వేరే కూరలతో కలిపి వండుకుని తినడాన్ని మానేయండి. నీళ్లలో లేదా ఆవిరికి ఉడికించో లేదా గ్రిల్, రోస్ట్, బేక్ చేసి తినండి.
  • - కారంకారంగా తినడాన్ని ఇష్టపడే వాళ్లు ఆలుని మొదట మసాలా దినుసులతో కలిపి నూనె వేయకుండా వేగించి తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుని తినొచ్చు.
  • - ఆలూని తొక్క తీయకుండా తినాలి. ఎందుకంటే తొక్కలో పీచు, ఫ్లేవనాయిడ్స్, ఇతర పోషకాలు ఉంటాయి. ఆలూ పైన టాపింగ్‌కి వాడే పదార్థాల్లో కొవ్వు, ఉప్పు, కాలరీలు తక్కువగా ఉండాలి. చిప్స్, ఫింగర్స్ వెంట పడడం ఆపేసి ఆమె చెప్పిన పద్ధతిలో ఆలు తిని ఆరోగ్యంగా ఉండండి.

0 Comments



Leave a Reply.

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    October 2013
    September 2013
    May 2013

    Categories

    All
    ఆలు తినేందుకు ఐదు కారణాలు...
    జంక్ ఫుడ్డా ........ జంకాల్సిందే!
    మీకు తెలుసా...
    హైబి.పి తగ్గాలంటే
    మెదడు
    కడుపు
    కడుపు
    కాలిన గాయాలకు
    బరువు తగ్గించే మసాలా!
    జలుబు తగ్గడంకోసం
    గోళ్ళు బీటలు వారుతుంటే..
    తాగండి నిమ్మరసం
    ఆరోగ్య చిట్కాలు
    గడ్డలు తగ్గడానికి
    త్వరగా నిద్రపోండి...
    ఆరోగ్యం - మంచు ముక్కల ఉపయోగం
    విటమిన్ 'డి' తక్కువైతే..
    దగ్గుతో బాధపడేవారు..
    చెవిపోటు తగ్గాలంటే
    నిమోనియా పేషెంట్స్ కి
    మలబద్దకం తగ్గాలంటే..
    ఎక్కిళ్ళు తగ్గాలంటే
    నిత్యావసర వస్తువులతో తేలికైన ఆరోగ్యం
    అజీర్ణంతో బాధపడేవారు..
    తలనొప్పికి
    పులిపుర్లు తొలగిపోవాలంటే
    ఆరోగ్యానికి యాలకులు
    నల్లమిరియాలు
    కొలెస్ట్రాల్ ని అదుపు చేయడానికి
    ఆర్థ్రయుటిక్ నొప్పుల నుండి ఉపశమనం కోసం
    ఇస్నోఫీలియాతో బాధపడేవారు..

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.