- - నిమ్మ రసానికున్న సుగుణాలను లెక్కపెడితే రెండు చేతులకున్న వేళ్లు సరిపోవు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలోకి కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
-మానసిక ఒత్తిళ్లను తగ్గించి, కొత్త ఉత్సాహాన్నిచ్చే శక్తి నిమ్మకు పుష్కలం. - - కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది. కాలేయ జీవితకాలాన్ని పెంచుతుంది.
- - నిమ్మలో దొరికినంత 'సి' విటమిన్ మరే పండులోను లభించదు. వయసుపెరుగుతున్నా చర్మాన్ని ముడుతలు పడనీయదు. మేనిఛాయ మెరుగవుతుంది. ఇది యాంటీసెప్టిక్‌గా పనిచేయడం వల్ల చర్మ సమస్యలూ దరిచేరవు.
- - ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు గొంతువాపు వస్తుంది. దీనికి సరైన విరుగుడు నిమ్మరసం. వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.
- - పంటినొప్పిని తగ్గించే శక్తీ నిమ్మకు ఉంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. లెమన్ వాటర్ గమ్ నమిలినా ఈ ఫలితం కనిపిస్తుంది.
- -నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. చౌకధరలో దొరికే నిమ్మ ద్వారా విలువైన వీటిని పొందవచ్చు.