బూందీ: 100 గ్రా.
పెరుగు: 1 కప్పు
ఉప్పు: తగినంత
వేయించిన జీలకర్ర పొడి:
1/2 టీ స్పూను
కొత్తిమీర తరిగినది:
2 టేబుల్ స్పూన్లు
కారం: 1/2 టీ స్పూన్
తయారు చేసే విధానం:
- పెరుగును చిక్కగా చిలుక్కోవాలి.
- దానిలో ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర ఆకులలో సగం వేయాలి. అందులో బూందీ వేసి గరిటతో బాగా కలపాలి.
- తర్వాత మిగిలిన జీలకర్ర పొడి, కొత్తిమీర ఆకులు, కారం వేసి సర్వ్ చేయడమే. దీనిని కాసేపు ఫ్రిజ్లో ఉంచి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది.
మూలం : సూర్య దినపత్రిక