telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

పెనవేసుకొనే పేగు బంధం

10/28/2013

0 Comments

 
Picture
                             సహజంగా సమాజంలో తండ్రులందరికీ కూతుళ్లపట్ల అంతులేని మమకారం ఉంటే.. కూతుళ్లందరికీ తండ్రి పట్ల అపారమైన అనురాగం ఉంటుంది. అయితే జీవన గమనంలో అమ్మాయిలు టీనేజ్‌ వచ్చేసరికి తండ్రితో కొంత దూరం కావడం సహజం. కానీ నేడు ఒక్కరిద్దరు సంతానం కావడం. ఆ ఒక్కరిద్దరూ ఆడపిల్లలే అయితే తండ్రితో కూడా అరమరికలు లేకుండా ఉండడం నేటి సమాజంలో వచ్చిన ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రధానంగా అమ్మాయిల జీవితంపై అత్యంత ప్రభావం చూపేవారిలో మొట్టమొదటి వ్యక్తి - తండ్రే. తండ్రులు కూడా తమ కూతుళ్ళను మానసిక సై ్థర్యం, ఆత్మవిశ్వాసం నిండిన రేపటి మహిళగా అభివృద్ధి చేయాలని తపన పడతారు. అమ్మాయిల జీవితంలో తండ్రి ప్రభావం వారి ఆత్మగౌరవాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ, పురుషులపై అభిప్రాయాలనూ తెలియజేస్తుంది. ఇన్ని ఉన్నా తండ్రీ కూతుళ్ల బంధం పట్టిష్ఠంగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే!

                        చిన్నపిల్ల కాబట్టి, మీ అమ్మాయికి ఏమీ తెలియదు అనే వైఖరితో ఉండకండి. ఈ రోజుల్లో పిల్లలు చాలా సున్నిత మన స్కులుగా ఉంటున్నారు. వారేం చేస్తున్నారో వారికి తెలుసు. ఒకవేళ మీ అమ్మాయికి మీ భార్యకి మధ్య సమస్య వచ్చిం దనుకోండి. నాకెందుకులే!' అనుకోకండి. మీరు మధ్యవర్తిత్వం నిర్వహించాల్సిందే. మీ ప్రవేశంతో ఆ సమస్య తేలికగా పరిష్కారమవుతుంది.

సంభాషించడం నేర్చుకోండి

               ఓ తండ్రిగా మీరు సంభాషణ చేయకుండా, చీకాకు పడే వారిలో ఒకరు అయితే అది వెంటనే మార్చుకోండి. ఆమెకు చదువులో సహాయం చేయడం, ఎప్పుడో ఒకసారి ఆమెకు చిన్న పార్టీ ఇవ్వడం లాంటివి చేయండి. అదీ కాకపోతే షాపింగ్‌కి తీసికెళ్లడం వంటి చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించి చూడండి. అదే మీ మధ్య బాంధవ్యాన్ని పటిష్ఠం చేయడానికి దోహదపడుతుంది.

ఆమెను నమ్మండి

                  అనుమానించడం ఓ పెద్ద సమస్య. అందులోనూ అమ్మాయిలు యుక్తవయస్సుకు వచ్చాక సహజంగా తండ్రులు వారి రక్షణ కోసం అహరహం తపిస్తుంటారు. కోడిపిల్లల్ని కోడి రక్షించినంతగా తెగ తాపత్రయపడిపోతారు. నేటి సమాజంలోని పరిస్థితులు కూడా కొంతవరకు అందుకు కారణమనుకోండి!

                   కానీ అదే పనిగా పెట్టుకుంటే మాత్రం మీ ప్రవర్తనతో అమ్మాయిలకు విసుగొస్తుంది. అప్పుడు తండ్రి అని చూడకుండా మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. మీ కుమార్తె ఆచూకీ గురించి ఎక్కువ అనుమానాలు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఒకరిపై మరొకరు నమ్మకం కలిగి ఉంటే, అబద్ధాలకు, అనుమానాలకు తావుండదు. మీరు అనుమానిం చడం మొదలుపెడితే అబద్ధాలు కూడా పుట్టుకొస్తాయి. మీ దగ్గర దాపరికం లేకుండా పిల్లలు మీకు అన్నీ చెప్పుకునే అవకాశం కలిగించాల్సిందే మీరే! ఆ సంగతి గుర్తుంచుకోండి!

స్వేచ్ఛగా ఉండనివ్వండి

                       వాళ్ళు ఎప్పుడూ పిల్లలు కారు. వారి తప్పుల్ని వారే సరి దిద్దుకునే అవకాశం ఇవ్వండి. అలాంటి తప్పుల గురించి పదే పదే ప్రస్తావించడం మానుకోండి. వారి తప్పును సరిదిద్దడంలో సహాయం చేయండి. అంతేతప్ప, మీరే సరిదిద్దాలని అనుకోకండి. అలా చేయకపోతే, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా ఎదు ర్కోవాలో పిల్లలు ఎప్పటికీ తెలుసుకో లేరు. బోధనలు మానండి. వారిలో మంచి పట్ల ఎక్కువ ఆసక్తి చూపండి. అలా చేయడం వల్ల మీ పట్ల వారు మరింత ప్రేమగా ఉంటారు.

బేషరతుగా ప్రేమించండి

                      ఆమె మీ సొంత కూతురు. ఆమె ఏదైనా తప్పు చేసినా లేదా ఆమె మీకు తగ్గ కూతురు కాక పోయినా బేషరతుగా ప్రేమించండి. మీ ప్రేమ వల్ల ఆమె తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా మారటానికి అది తోడ్పడుతుంది. తరువాత తరువాత తండ్రిని మించిన తనయగా ఆమె ఎదిగి తీరుతుంది.

ఆమె స్నేహాలను అంగీకరించండి

                  మీ కూతురి సాంఘిక పరిచయాలను అంగీకరిం చడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. ఆమెకున్న స్నేహితులను చూసి ఎక్కువమంది తండ్రులు ఆశ్చర్యపోవచ్చు కూడా. అయితే వారికి మంచేమిటో, చెడేమిటో పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా సందర్భాను సారం చెపుతూ ఉండండి. చివరి నిర్ణయం మాత్రం ఆమెకే వదిలేయండి.

సహనంతో ఉండండి

                    హార్మోన్ల ప్రభావం కావచ్చు, సహజ గుణమే కావచ్చు... ఏది ఏమైనా ఒకోసారి మనల్ని మనం అదుపులో ఉంచుకోలేం. అలా సహనాన్ని కోల్పోకుండా చూసుకోండి. మీరు గొంతు పెంచకపోతే ఆమె కూడా పెంచదు. ఒకోసారి ఆమె పెంచి మిమ్మల్ని అడ్డుకోవాలని చూసినా మీరు సహనంతో ఉండడం చాలా అవసరం. మీరు అంతగా స్పందించలేదని గ్రహిస్తే, ఆమె మీ ముందు మౌనంగానే ఉంటుంది.

ఆమెకు కొంత సమయం కేటాయించండి

                సమయం బంధాన్ని నిలిపే గొప్ప అంశం. ఎవరితో నైనా ఏ బంధం బలపడాలన్నా ఇదే కీలకం. సమయం ఇవ్వకుండా బంధం నిలవాలంటే కష్టమే మరి. ఆమెకు ఇష్టమైనవి చేయడానికి ప్రయత్నించి తేడా మీరే గమ నించండి. ఆమె మీ మార్గాన్ని తప్పక ఇష్టపడుతుంది.

                    ఈ కొన్ని విషయాలనైనా పరిగణనలోకి తీసుకుంటే తప్పకుండా తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం బలపడుతుంది. అది వారి మధ్య అపూర్వ బంధంగా మారి తీరుతుంది.

0 Comments

రాత్రిపూట పనిచేస్తే...

10/28/2013

0 Comments

 
Picture
                    ఏళ్ల తరబడి రాత్రి షిఫ్టుల్లో పనిచేయడం ఆడవారి ఆరోగ్యానికి ముప్పేనంటున్నారు పరిశోధకులు. ఎక్కువకాలం రాత్రి పూట పని చెయ్యడం వల్ల టైప్ 2 డయాబెటిస్, అధిక బరువు వంటివి రావొచ్చని హెచ్చరిస్తున్నారు వారు. అలాగే పొగతాగడం వంటి వ్యసనాల బారిన పడే అవకాశమూ హెచ్చేన ట. నిరంతరంగా నిశివేళల్లో ఉద్యోగాలు చెయ్యడం వల్ల మన శరీరంలో ఉండే గడియారం (సర్కాడియన్ రిథమ్) పనితీరులో తీవ్రమైన మార్పులొచ్చేస్తాయట. దాంతో నిద్ర, శక్తి, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల పనితీరు - అన్నిటిలోనూ మార్పులొచ్చి, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

0 Comments

నెలసరి నొప్పి తగ్గేదెలా?

10/21/2013

0 Comments

 
Picture
ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలలో బహిష్టు సమయంలో పొత్తి కడుపునొప్పి బాధిస్తుంది. ఇటువంటి నొప్పినే వైద్య పరిభాషలో డిస్మెనోరియా (పెయిన్‌ఫుల్‌ మెన్సెస్‌) అంటారు. బహిష్టు కనబడిన తర్వాత మొదటి, రెండు మూడు సంవత్సరముల వరకూ బహిష్టు సమయంలో పొత్తికడుపునొప్పి రావడం సాధారణంగా జరుగదు.  సుమారు 50శాతం మంది స్త్రీలు బహిష్టు సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్తవయస్సు అంటే 18సంవత్సర ముల నుండి 24సంవత్సరముల వరకూ ఉన్న స్త్రీలలో బహిష్టు సమయంలో కడుపునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వివాహ అనంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది. 

                  డిస్మెనోరియాలను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది ప్రైమరీ డిస్మెనోరియా, రెండవది సెకండరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా యుక్తవయస్సులోని స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి బహిష్టు సమయంలో పొత్తికడుపునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా హార్మోనుల అసమతుల్యతే కారణం. సెకండరీ డిస్మెనోరియా వయస్సు మీరిన స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి గర్భాశయ కణుతులు, పెల్విక్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉండటం కారణం. అలాగే బహిష్టు సమయంలో కండరాల సంకోచాల వల్ల గర్భకోశ ముఖ ద్వారం వంగి ఉండటం వలన, ఓవేరియన్‌ సిస్టుల వల్ల కూడా బహిష్టు సమయంలో కడుపునొప్పి ఎక్కువగా వస్తుంటుంది.  మానసిక ఒత్తిడి, హార్మోనుల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌, జన్యులోపాలే వాటికి కారణం. బహిష్టు సమయంలో పొత్తి కడుపులో నొప్పితో రక్తస్రావం ఎక్కువ కావడం. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌ ఉన్నప్పుడు బహిష్టు సమయంలో కాకుండా మధ్యమధ్యలో కడుపునొప్పితో రక్తస్రావం ఎక్కువ కావడం. పొత్తికడుపులో నొప్పి తీవ్రంగా ఉండును. పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవటం జరుగుతుంది. బరువు పెరుగుట, మానసికంగా చికాకుగా కోపంగా ఉండటం వీటి లక్షణాలు.

జాగ్రత్తలు
- హార్మోనుల సమతుల్యతను కాపాడటానికి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, పాలు, గ్రుడ్లు, పండ్లు, కాయగూరలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.


- అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గటానికి ప్రయత్నించాలి.

- నిత్యం, యోగా ప్రాణాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని నివారించటానికి ధ్యానం చేయాలి.

నొప్పి తీవ్రత, రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.

చికిత్స
               హోమియో వైద్యంలో బహిష్టు సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పికి మంచి చికిత్స కలదు. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, పరిగణనలోకి తీసుకుని మందులను ఎన్నుకుని వైద్యం చేసిన బహిష్టు సమయంలో వచ్చే నొప్పి నుండి విముక్తి పొందవచ్చును.


మందులు
                       మెగ్నీషియం ఫాస్‌, లేకసిస్‌, బెల్లడోనా, సెపియా, నైట్రోమోర్‌, కామామిల్లా, కాల్మియా, సెబైనా, ఎకోనైట్‌. కోలోసింత్‌, కాల్కేరియాకార్బ్‌ వంటి మందులను లక్షణాలను బట్టి ఎన్నుకుని వైద్యం చేసిన నెలసరి నొప్పి నుండి విముక్తి పొందవచ్చును.

0 Comments

అల్లుకునే బంధాలకు బతుకమ్మ

10/4/2013

0 Comments

 
Picture
                  'ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జామాయే చందమామా'... బతుకమ్మ పండగ వచ్చేసింది. ఇక తొమ్మిది రోజులూ పూల సంబరాలే. సాయంత్రం అయ్యిందంటే చాలు... వీధులన్నీ పాటల జలపాతాలే. అతివల మనసుల నిండా ఆనందాల చప్పట్లే. రాశులు పోసుకునే పల్లె సౌందర్యం... పాటలల్లుకునే జీవితానుభవ సాహిత్యం... అనుబంధాలను పేర్చే సాన్నిహిత్యం... సాహసం, సామాజిక తత్వం... అన్నీ కలబోసుకునే ప్రకృతి పండగే ఇది అంటూ బతుకమ్మ విశేషాలని చెబుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.తుకమ్మ... కఠిన నియమాలతో జరుపుకునే పండగ కాదు. కష్ట సుఖాలను పంచుకుంటూ ఇష్టంగా చేసుకునే పర్వదినం.

                     వీధి, గ్రామం, వూరిలోని మహిళలందర్నీ సంఘటిత పరిచే వేడుక. తొమ్మిది రోజుల పాటు సందడిగా సాగే బతుకమ్మ ప్రకృతిని ప్రేమించాలనీ, పూజించాలనీ చెబుతుంది. అప్పుడే ఆనందం, ఆరోగ్యం అని తెలియజేస్తుంది. మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు... అక్కాచెల్లెళ్లూ, ఆడబిడ్డలూ, అత్తలూ, వదినలూ, స్నేహితురాళ్లూ, ఇరుగుపొరుగూ, ఆత్మీయులతో కలిసి ఆటలాడి, ఆనందం పొందాలి. భవిష్యత్తు ఆలోచనలను పంచుకుని ముందుకు సాగాలి. ప్రతి ఏటా ఈ మాటల్ని గుర్తు చేసే సంబరంగా బతుకమ్మ పేరు పొందింది. పెళ్లయి అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డల్ని పుట్టింటికి పిలిచి, వడిబియ్యం పోసి, కొత్త బట్టలు పెట్టి ఆదరించడమనే సంప్రదాయం ఈ పండగప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. ఈ ఆధునిక కాలంలో ఎవర్నయినా కదిలిస్తే 'నేనూ... నా వాళ్లూ' అనే చెబుతుంటారు. కానీ బతుకమ్మ తల్లి... వూరి బాగు కోసం, ప్రజలందరి సంతోషం కోసం కలిసి కట్టుగా ముడుపు కట్టాలని చెబుతుంది. అందుకే చెరువునీ, ప్రకృతినీ, గ్రామాన్నీ, ప్రతి ఇంట్లో అందరినీ చల్లగా చూడమని గౌరమ్మను మనం పూలతో పూజిస్తాం.

            ప్రతి పువ్వూ విలువైనదే...మనకు చాలా పండగలున్నాయి. ప్రతి పండగప్పుడూ దేవుళ్లని మల్లెలూ, గులాబీలూ, చామంతులూ, కనకాంబరాలతో పూజిస్తాం. కానీ సిబ్బి (వెదురు అల్లిక)లో, ఇత్తడి తాంబూలంలో బతుకమ్మని పేర్చడంలో ఖరీదయిన పూలని వాడం. పసుపు ఆరబోసినట్లు పెరిగే తంగేడూ, బంతిపూలూ... చేను చెలకలో ఉండే గునుగు పూలూ, పట్టుకుచ్చులూ... ముళ్ల కంచెలపై కనిపించే కట్లపూలూ... పెరట్లో పెరిగే మందారాలూ, గన్నేరు వంటివి వాడతాం. ప్రకృతిలో ప్రతి ఒక్కటీ విలువైందని చెప్పడమే ఈ పండగ ప్రత్యేకత. చిత్రం ఏంటంటే, ఇవన్నీ ఎరువులు వాడకుండా పెరిగే సహజమైన పూలు. స్వచ్ఛమైన ఈ పూలతో బతుకమ్మను పేర్చి, తమలపాకుల్లో పసుపు గౌరమ్మను ఉంచి, పూజించడం ఆరోగ్యానికెంతో మంచిది.

                    తంగేడు పూలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బతుకమ్మ నిమజ్జనంతో చెరువులు బాగుపడతాయి. తంగేడూ, గునుగూ, పసుపు ముద్ద, తమలపాకులు చెరువుల్లో పేరుకున్న నాచునీ, కాలుష్యాలనీ తగ్గించి నీటిని శుద్ధి చేస్తాయి.సంప్రదాయాల్లో సమభావం...పెళ్లి కానివారు మంచి భర్తను కోరుకుంటూ, పెళ్లయిన వారు భర్తా, కుటుంబ క్షేమాన్ని కోరుకుంటూ ఈ పండగ జరుపుకొంటారు. కొత్త కోడళ్లకు ఇది మరీ ముఖ్యమైన పండగ. ప్రత్యేకంగా జరుపుకుంటారు. కాలం మారింది. ఆధునికత ఎక్కువైంది. అయినా ఏటికేడాది బతుకమ్మ ఆడే మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంది. కారణం ఏమంటే... బతుకమ్మ ఆచార సంప్రదాయాల్లో ఆటలున్నాయి. పాటలున్నాయి. సృజనాత్మక పోటీలున్నాయి. జీవితానికి ఉపయోగపడే పాఠాలున్నాయి. రంగురంగుల బతుకమ్మను ఒక్కరే పేర్చరు. ఇంట్లో వాళ్లూ, ఇరుగుపొరుగూ కలిసి అందంగా తీర్చిదిద్దుతారు. ఒకే దాన్ని కాకుండా, తల్లి బతుకమ్మకు తోడుగా పిల్ల బతుకమ్మనూ సిద్ధం చేస్తారు. తల్లి పక్కన పిల్ల ఉండాలనే మాతృమూర్తి మనసు తెలపడమే అది.

                   చెరువూ, కాలువల వద్దకెళ్లి ... బతుకమ్మలను మధ్యలో ఉంచి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' అని ఆడి పాడటంలో సంపన్నులూ, సామాన్యులూ అన్న తేడా ఉండదు. ఇంటి నుంచి తీసుకెళ్లిన రుచికరమైన పదార్థాలను అందరూ కలిసి కూర్చుని తినడం, పసుపు వాయనాలు ఇచ్చుకోవడం సమభావాన్ని పెంచేవే. గత కొన్నేళ్ల పండగ తీరుని గమనిస్తే, పెద్ద సంఖ్యలో అమ్మాయిలు బతుకమ్మ ఆడటానికి వస్తున్నారు. పాటలు నేర్చుకుని ఉత్సాహంగా పాడుతున్నారు. సీతమ్మని అత్తారింటికి పంపే పాట కావచ్చు, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే పాట కావచ్చు... వాటిల్లో తమను తాము తరచి చూసుకుని, సహానుభూతి పొందగలగడమే అందుకు కారణం. మేమూ, ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్నా విలువైన మన సంస్కృతీ సంప్రదాయాల మూలాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆడపిల్లలకు చెబుతున్నాం.

                 బతుకమ్మ కథలు...బతుకమ్మ జరుపుకోవడం అంటే లక్ష్మీ పార్వతులను పూజించడంగా భక్తులు భావిస్తారు. భయాలు పోతాయనీ, భాగ్యాలు కలుగుతాయనీ నమ్ముతారు. ఇంత బలమైన విశ్వాసం ఏర్పడటానికి ప్రచారంలో ఉన్న బతుకమ్మ గాథలే కారణమని చెప్పొచ్చు. మహిషాసురుడితో యుద్ధం చేసి దుర్గమ్మ అలసి సొమ్మసిల్లింది. అప్పుడు జగన్మాత సేదతీరేందుకు స్త్రీలు సేవలు చేశారు. మానసికోల్లాసం కలిగేలా పాటలు పాడారు. అమ్మకు అలసట తీరింది. మహిషాసురుణ్ని వధించి, ప్రజలకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ప్రజలకు బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆ రోజు నుంచి దుర్గమ్మ, బతుకమ్మ అయింది.

                  చోళ రాజు ధర్మాంగదుడుకి వందమంది కొడుకులు. అంతా యుద్ధంలో మరణించారు. మనోవేదనకు గురైన ఆ రాజు, పిల్లల కోసం తపస్సు చేయగా లక్ష్మీదేవి కూతురిగా పుట్టింది. ఈ జన్మ వృత్తాంతం తెలిసిన రుషులు ఆ పాపకు 'బతుకమ్మ' అని పేరు పెట్టారు. చక్రాంకుడనే పేరుతో జన్మించిన విష్ణువే ఆమెను పెళ్లాడాడు. వీళ్లిద్దరూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ పాలించారు. అందుకే బతుకమ్మను దేవతగా కొలుస్తూ ఏటా పండగ జరుపుకునే సంప్రదాయం నెలకొంది.

                  చిన్న పదాలు... సరళమైన భాష... లోతయిన భావం... 'ఉయ్యాలో', 'కోల్‌', 'గౌరమ్మా' అనే ఆవృతాలతో వచ్చే బతుకమ్మ పాటల్లో... ఉయ్యాల పాటలున్నాయి. అనుబంధాల ప్రాధాన్యాన్ని చెప్పే, అత్తారింట్లో ఎలా మెలగాలో వివరించే గీతాలున్నాయి. చిన్ని కృష్ణుని చిలిపి పనులూ, గౌరీదేవి స్తుతులూ, రాముని కథలూ... మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. వివిధ వృత్తుల ప్రత్యేకతలూ, వరకట్నం వంటి సమస్యలను ఎదుర్కొనే తీరుతెన్నుల్ని వలయాకారంలో తిరుగుతూ, చప్పట్లతో పాడితే ఉత్సాహం ఉరకలెత్తుతుంది.

0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.

    Archives

    May 2014
    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    July 2013
    June 2013

    Categories

    All
    'నోబెల్' ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?
    టెన్ కమాండ్‌మెంట్స్
    మామిడి వనం.. మహిళకు వరం!
    అస్త్ర తంత్ర : కాన్ఫిడెన్సే మీ బాడీగార్డ్
    నెలసరి నొప్పి తగ్గేదెలా?
    కాబోయే తల్లులూ... మందుల విషయంలో జర భద్రం!
    పోషకాహార లోపం.. పడతులకు శాపం
    కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం
    మొదలైందా నెలసరి...ఈ ఆహారం సరి..!
    అల్లుకునే బంధాలకు బతుకమ్మ
    ఆడశిశువుకు ఆహ్వాన గీతిక..!
    పెనవేసుకొనే పేగు బంధం
    అత్తారింట్లో నవవధువు అలవాటుపడేదెలా?
    పోషకాహారంతోనే శిశువు ఆరోగ్యం
    పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
    పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
    తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడ
    ఆసక్తి ఉంటే అతివకు ‘షేర్ మార్కెట్’ సులభమĺ

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.