- సరిగా ఉడకని, సగం ఉడికిన మాంసాహారం మంచిదికాదు. ఇలాంటి ఆహారపదార్థంలో ఉండే క్రిములు తల్లిమీద కంటే కడుపులోని శిశువుమీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి.
- చేపలు, రొయ్యలులాంటి జలచర ఆహారానికీ దూరంగా ఉండాలి.
- సరిగా కడగని లేదా అసలు కడగని పండ్లు తినకూడదు. పచ్చికూరగాయలకూ దూరంగానే ఉండండి. లేకపోతే వీటిమీద ఉండే పురుగుల మందుల అవశేషాలు కడుపులోని లేతప్రాణం మీద విపరీత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
- సరిగా కడగని, ఉడికించని ఆహార పదార్థాలమీద ఉండే పురుగుగుడ్లు ఇన్ఫెక్షన్లకు, రక్తలేమికి దారితీస్తాయి.
- అలాగే సరిగా మూతపెట్టని, నిలువ ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే ఉత్తమం. పండ్లరసాలను కూడా వీలయినంత వరకు ఎప్పటికప్పుడు తాజాగా ఇంట్లో చేసుకుని తాగాలి. తయారుచేసిన తరువాత ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా తాగడం ఉత్తమం.
- పండ్లు రసం తీసుకుని తాగడం కంటే పండుగానే తినడం వల్ల దాంట్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ ఇతర జీవక్రియలు సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది.
- పాలుకానీ, జున్నుకానీ ఎక్కువసేపు మరి గించిన తరువాతే తీసుకోవాలి. సరిగా మరిగించని పాలు, జున్నుల్లో ఉండే బ్యాక్టీరియా వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
- తాగేనీటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వచ్చ మైన నీటిని తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.