చిన్నపిల్ల కాబట్టి, మీ అమ్మాయికి ఏమీ తెలియదు అనే వైఖరితో ఉండకండి. ఈ రోజుల్లో పిల్లలు చాలా సున్నిత మన స్కులుగా ఉంటున్నారు. వారేం చేస్తున్నారో వారికి తెలుసు. ఒకవేళ మీ అమ్మాయికి మీ భార్యకి మధ్య సమస్య వచ్చిం దనుకోండి. నాకెందుకులే!' అనుకోకండి. మీరు మధ్యవర్తిత్వం నిర్వహించాల్సిందే. మీ ప్రవేశంతో ఆ సమస్య తేలికగా పరిష్కారమవుతుంది.
సంభాషించడం నేర్చుకోండి
ఓ తండ్రిగా మీరు సంభాషణ చేయకుండా, చీకాకు పడే వారిలో ఒకరు అయితే అది వెంటనే మార్చుకోండి. ఆమెకు చదువులో సహాయం చేయడం, ఎప్పుడో ఒకసారి ఆమెకు చిన్న పార్టీ ఇవ్వడం లాంటివి చేయండి. అదీ కాకపోతే షాపింగ్‌కి తీసికెళ్లడం వంటి చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించి చూడండి. అదే మీ మధ్య బాంధవ్యాన్ని పటిష్ఠం చేయడానికి దోహదపడుతుంది.
ఆమెను నమ్మండి
అనుమానించడం ఓ పెద్ద సమస్య. అందులోనూ అమ్మాయిలు యుక్తవయస్సుకు వచ్చాక సహజంగా తండ్రులు వారి రక్షణ కోసం అహరహం తపిస్తుంటారు. కోడిపిల్లల్ని కోడి రక్షించినంతగా తెగ తాపత్రయపడిపోతారు. నేటి సమాజంలోని పరిస్థితులు కూడా కొంతవరకు అందుకు కారణమనుకోండి!
కానీ అదే పనిగా పెట్టుకుంటే మాత్రం మీ ప్రవర్తనతో అమ్మాయిలకు విసుగొస్తుంది. అప్పుడు తండ్రి అని చూడకుండా మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. మీ కుమార్తె ఆచూకీ గురించి ఎక్కువ అనుమానాలు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఒకరిపై మరొకరు నమ్మకం కలిగి ఉంటే, అబద్ధాలకు, అనుమానాలకు తావుండదు. మీరు అనుమానిం చడం మొదలుపెడితే అబద్ధాలు కూడా పుట్టుకొస్తాయి. మీ దగ్గర దాపరికం లేకుండా పిల్లలు మీకు అన్నీ చెప్పుకునే అవకాశం కలిగించాల్సిందే మీరే! ఆ సంగతి గుర్తుంచుకోండి!
స్వేచ్ఛగా ఉండనివ్వండి
వాళ్ళు ఎప్పుడూ పిల్లలు కారు. వారి తప్పుల్ని వారే సరి దిద్దుకునే అవకాశం ఇవ్వండి. అలాంటి తప్పుల గురించి పదే పదే ప్రస్తావించడం మానుకోండి. వారి తప్పును సరిదిద్దడంలో సహాయం చేయండి. అంతేతప్ప, మీరే సరిదిద్దాలని అనుకోకండి. అలా చేయకపోతే, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా ఎదు ర్కోవాలో పిల్లలు ఎప్పటికీ తెలుసుకో లేరు. బోధనలు మానండి. వారిలో మంచి పట్ల ఎక్కువ ఆసక్తి చూపండి. అలా చేయడం వల్ల మీ పట్ల వారు మరింత ప్రేమగా ఉంటారు.
బేషరతుగా ప్రేమించండి
ఆమె మీ సొంత కూతురు. ఆమె ఏదైనా తప్పు చేసినా లేదా ఆమె మీకు తగ్గ కూతురు కాక పోయినా బేషరతుగా ప్రేమించండి. మీ ప్రేమ వల్ల ఆమె తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా మారటానికి అది తోడ్పడుతుంది. తరువాత తరువాత తండ్రిని మించిన తనయగా ఆమె ఎదిగి తీరుతుంది.
ఆమె స్నేహాలను అంగీకరించండి
మీ కూతురి సాంఘిక పరిచయాలను అంగీకరిం చడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. ఆమెకున్న స్నేహితులను చూసి ఎక్కువమంది తండ్రులు ఆశ్చర్యపోవచ్చు కూడా. అయితే వారికి మంచేమిటో, చెడేమిటో పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా సందర్భాను సారం చెపుతూ ఉండండి. చివరి నిర్ణయం మాత్రం ఆమెకే వదిలేయండి.
సహనంతో ఉండండి
హార్మోన్ల ప్రభావం కావచ్చు, సహజ గుణమే కావచ్చు... ఏది ఏమైనా ఒకోసారి మనల్ని మనం అదుపులో ఉంచుకోలేం. అలా సహనాన్ని కోల్పోకుండా చూసుకోండి. మీరు గొంతు పెంచకపోతే ఆమె కూడా పెంచదు. ఒకోసారి ఆమె పెంచి మిమ్మల్ని అడ్డుకోవాలని చూసినా మీరు సహనంతో ఉండడం చాలా అవసరం. మీరు అంతగా స్పందించలేదని గ్రహిస్తే, ఆమె మీ ముందు మౌనంగానే ఉంటుంది.
ఆమెకు కొంత సమయం కేటాయించండి
సమయం బంధాన్ని నిలిపే గొప్ప అంశం. ఎవరితో నైనా ఏ బంధం బలపడాలన్నా ఇదే కీలకం. సమయం ఇవ్వకుండా బంధం నిలవాలంటే కష్టమే మరి. ఆమెకు ఇష్టమైనవి చేయడానికి ప్రయత్నించి తేడా మీరే గమ నించండి. ఆమె మీ మార్గాన్ని తప్పక ఇష్టపడుతుంది.
ఈ కొన్ని విషయాలనైనా పరిగణనలోకి తీసుకుంటే తప్పకుండా తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం బలపడుతుంది. అది వారి మధ్య అపూర్వ బంధంగా మారి తీరుతుంది.