కావలసిన పదార్థాలు:
మటన్-కిలో, గరంమసాలా పొడి-రెండు టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి-రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి-50గ్రా
ఉల్లిపాయలు-నాలుగు, టమాటాలు-రెండు, కారం -రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి-నాలుగు, పుదీనా-కట్ట, ఆమ్చూర్పొడి-ఒక టీస్పూన్
ఉప్పు-సరిపడా, కొత్తిమీర తురుము-ఒక టేబుల్ స్పూన్
గసగసాలు-ఒకటేబుల్ స్పూన్,
గరంమసాలా దినుసులు, యాలకులు, రెండు టేబుల్ స్పూన్లు
ధనియాలు-ఒక టీస్పూన్, జాజికాయ-ఒకటి, జాజిమొగ్గ- ఒకటి
దాల్చిన చెక్క-అంగుళం ముక్క, లవంగాలు-నాలుగు, జాపత్రి-రెండు
తయారుచేసే విధానం
మటన్ ముక్కల్ని కడిగి పక్కన ఉంచాలి. గరంమసాలా దినుసులన్నింటినీ పలుచని బట్టలో మూటకట్టాలి. ప్రెషర్పాన్లో మటన్ముక్కలు, ఉప్పు, కారం మసాలా దినుసుల మూట వేసి ఉడికించాలి. మందపాటి బాణలిలో నెయ్యి వేసి ఉడికిన మటన్ ముక్కల్ని వేసి వేయించాలి.
మరో బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి ఉల్లిముక్కలు, టమాట ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి తురుము వేసి వేయించాలి. తరువాత మసాలా పొడి వేసి కలపాలి. ఆమ్చూర్పొడి, పుదీనా ఆకులు కూడా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మటన్ ముక్కల మీద వేసి కలపాలి. చివరగా గసగసాలు, కొత్తిమీర తురుము కూడా చల్లి దించాలి.