చికెన్ - ఒక కిలో
బాస్మతి బియ్యం - ఒక కిలో
గరం మసాల - రెండు టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను
పెరుగు - ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
పచ్చి మిరపకాయలు - ఐదు
ఎండు మిరపకాయలు - ఆరు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
తయారు చేసే విధానం:
- ముందుగా మాoసాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి.
- బియ్యాన్ని కడిగి ఆరబెటుకోవాలి.
- ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతుల నీళ్లు పోసి పొయ్యి మీద ఉడికించాలి.
- పొయ్యి మీద మరో మందపాటి పాత్ర ఉంచి సరిపడా నూనె వేసి పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
- ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా పాత్ర లో వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయాలి.
- ఇలాగే ఇంకో పొరలా మిగలిన మాంసాన్ని, అన్నాన్ని వేసి మూత పెట్టాలి.
- పాత్ర నుంచి ఆవిరి బయటకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి.
- చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించు కోవాలి. దీనికి సైడ్ డిష్‌గా గోంగూరను కానీ, వంకాయ కూరను కానీ వేసి సర్వ్ చేసుకోవచ్చు.
మూలం : సూర్య దినపత్రిక