telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

నాటుకోడి పులుసు

6/28/2013

0 Comments

 
Picture
           రుచికరమైన నాటు కోడి పులుసు రాయల సీమవాసులకు ఎంతో ఇష్టం. దీనిని వేడివేడి గా తినాలని సీమ వాసులు కోరుకుంటారు.
కావలసిన పదార్ధాలు:
నాటుకోడి మాంసం    - 1 కేజి
నూనె                      - 50 గ్రా.
ఉల్లిపాయలు             - 150 గ్రా.
పచ్చిమిరపకాయలు  - ఆరు
అల్లం వెల్లుల్లి ముద్ద     - సుమారు 100 గ్రా.
ఉప్పు                     - తగినంత
పసుపు                  - 1 స్పూను
పెరుగు                   - 1 కప్పు
కొబ్బరి పొడి            - 2 టీ స్పూన్లు
కారంపొడి               - 1 స్పూను
ధనియాలపొడి        - 1 స్పూను
కొత్తిమీర                 - 1 కట్ట
పెరుగు                   - 1 కప్పు

తయారు చేసే విధానం:
  • ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 
  • తరువాత ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి, ఆ నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఈ మొత్తం ముద్దను దోరగా వేగాక ఈ మొత్తం మిశ్రమంలో కప్పు పెరుగు వేసి ఉడికించాలి. తరువాత కోడిమాంసం వేసి మాంసంలో నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి. తరువాత సరిపడా నీరు పోసి బాగా ఉడికించాలి. ఇప్పుడు మళ్లీ కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడికించాలి. ఇక ఘుమఘుమలాడే కోడి పులుసు రెడీ అవుతుంది. 
  • స్టౌమీద నుంచి పులుసును దించి తరిగిన కొత్తమీరను చల్లాలి. ఇక ఇప్పుడు సీమ వంటకం రుచికరమైన నాటు కోడి పులుసు సిద్ధం. 

0 Comments

చికెన్ స్టఫ్‌డ్ బ్రెడ్ రోల్స్

6/27/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ చికెన్   - 100 గ్రా. (ఉడికించి, మెత్తగా చేసుకోవాలి)
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
పసుపు             - అర టీ స్పూను
కారం                 - టీ స్పూను
జీలకర్ర పొడి        - టీ స్పూన్
ధనియాలపొడి    - అర టీ స్పూన్
గరంమసాలా      - టీ స్పూన్
ఉప్పు                - తగినంత
 కోడిగుడ్లు           - 2
బ్రెడ్ క్రంబ్స్        - కప్పు
నిమ్మరసం        - 2 టీ స్పూన్లు
బంగాళదుంప    - 1 (ఉడికించి, మెత్తగా చేయాలి)

తయారుచేసే పద్ధతి:
  • ఒక పాత్రలో ఉడికించిన బోన్‌లెస్ చికెన్, పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఉప్పు, గరంమసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి అరగంటసేపు ఊరనివ్వాలి.
  • స్టౌ మీద బాణలి ఉంచి వేడ య్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి.
  • చికెన్ మిశ్రమం వేసి బాగా వేయించాలి.
  • మిశ్రమం బాగా దగ్గరపడ్డాక, బంగాళదుంప ముద్ద వేసి కలపాలి.
  • బ్రెడ్ అంచులను కట్ చేసి, నీటితో కొద్దిగా తడి చేయాలి.
  • తయారు చేసి ఉంచుకున్న మిశ్రమం బ్రెడ్ మీద ఉంచి రోల్ చేయాలి.
  • ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన వేసి గిలక్కొట్టి ఒక ప్లేట్‌లో పోయాలి.
  • మరో ప్లేట్‌లో బ్రెడ్ క్రంబ్స్ వేయాలి.
  • బ్రెడ్ రోల్స్‌ని ముందుగా కోడిగుడ్డు సొనలో దొర్లించి ఆ తరువాత బ్రెడ్‌క్రంబ్స్ పొడిలో దొర్లించాలి.
  • స్టౌ  మీదపాన్ ఉంచి అందులో నూనె పోసి కాగాక, వీటిని ఒక్కటొక్కటిగా వేస్తూ చిన్నమంట మీద వేయించాలి.
  • బాగా వేగాక తీసి, సాస్‌తో కాని, చట్నీతో కాని సర్వ్ చేయాలి.
  
మూలం : సాక్షి దినపత్రిక

0 Comments

పొట్టేలు తలకూర

6/26/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్ధాలు:
పొట్టేలు తలకాయ మాంసం : 1 కేజి
నూనె                               : 50 గ్రా.
ఉల్లిపాయలు                     : 50 గ్రా.
పచ్చిమిర్చి                        : 50 గ్రా.
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌               : 50 గ్రా.
కొబ్బరిపొడి                         : ఒక స్పూన్‌
మిర్యాల పొడి                       : కొద్దిగా
కారంపొడి                             : సరిపడినంత
ఉప్పు                                  : సరిపడినంత
                                                               ధనియాల పొడి                     : ఒక స్పూన్‌

తయారు చేసే విధానం:
  • ముందుగా పొట్టేలు తలకాయ మాంసంను, ఉప్పు కలిపి కుక్కర్‌లో వేసి అందులో లీటర్‌ నీరు పోసి స్టౌ మీద పెట్టాలి. ఆరేడు విజిల్స్‌ వచ్చాక కుక్కర్‌ను స్టౌ మీద నుండి దించేయాలి. కొంత మంది కుక్కర్‌ కాకుండా పెద్దగిన్నెలోకి మాంసంను తీసుకొని కట్టెల పొయ్యి మీద బాగా ఉడికిస్తారు. అలా ఉడికించిన కూర చాలా రుచిగా ఉంటుందని సీమగ్రామాల్లో పెద్దలు చెప్తారు. అలా ఉడికించిన మాంసాన్ని పక్కన పెట్టుకోవాలి. 
  • తరువాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నూనె పోయాలి. ఆ తర్వాత నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పొట్టేలు మెదడు (బ్రెయిన్‌)) వేసి ఉడికించుకోవాలి. కుక్కర్‌లో ఉడికించిన మాంసంలోకి అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కొద్దిగా కొబ్బరిపొడి, మిర్యాలపొడి, ధనియాల పొడి, కారంపొడి వేసి బాగా ఇగరనిచ్చి దించేయాలి. ఇప్పుడు పొట్టేలు తలకూర రెడీ. 


0 Comments

అపోలో ఫిష్

6/25/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు : 
బోన్లెస్ ఫిష్ -  500 గ్రా. 
కార్న్ ఫ్లోర్      -           150 గ్రా. 
మైదా            -           100 గ్రా. 
గుడ్లు             -           2
తందూరి కలర్  -           చిటికెడు
ఉప్పు             -           తగినంత
నూనె             -           వేయించడానికి సరిపడా 
ఉల్లిపాయ        -           2
వెల్లుల్లి ముక్కలు -        1 టీస్పూన్ 
అల్లం ముక్కలు  -         1 టీ.స్పూన్
పచ్చిమిర్చి        -          3
ఎండుమిర్చి       -          3
కారం పొడి         -          1 టీ.స్పూన్ 
అజినొమొటొ      -          చిటికెడు 
ఉప్పు              -          తగినంత 
కరివేపాకు         -          2 రెబ్బలు
కొత్తిమీర           -          కొద్దిగా

తయారుచేసే పద్ధతి : 
  • బోన్లెస్ ఫిష్ తీసుకుని రెండంగుళాలసైజు ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. 
  • ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ , మైదా, గుడ్లు కొట్టివేసి, కలర్, తగినంత ఉప్పు వేసి కలిపి ఫిష్ ముక్కలను వేసి బాగా కలపాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి ఈ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలను అలాగే తినొచ్చు. లేదా మరి కొంచెం మసాలాలు వేసి ఘాటుగా చేసుకోవచ్చు.
  • పాన్ లో  మూడు చెంచాల నూనె వేడి చేసి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి, అల్లం ముక్కలు కూడా వేయాలి. కొద్దిగా వేపిన తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మరో రెండు నిమిషాలు వేపాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తర్వాత కారం పొడి, ఉప్పు, అజినొమొటో వేసి కలిపి వేయించిన ఫిష్ ముక్కలు వేసి కలుపుతూ మరో రెండు నిమిషాలు వేపి కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేయాలి.

మూలం : ఆంధ్రభూమి

0 Comments

ముర్గ్ మకాయ్ 

6/24/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
చికెన్ బ్రెస్ట్స్        -         అరకేజి (స్కిన్‌లెస్, బోన్‌లెస్)
మొక్కజొన్న గింజలు -   రెండు కప్పులు
తాజా పెరుగు     -          మూడు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు   -         పది
అల్లం                -         చిన్న ముక్క (తరగాలి)
క్యాప్సికమ్ ముక్కలు -   ఒక కప్పు
టొమాటోలు     -           నాలుగు (తరగాలి)
పచ్చిమిర్చి      -           రెండు (సన్నగా తరగాలి)
కారం, పసుపు  -          ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
ధనియాల పొడి -          ఒకటిన్నర టీస్పూన్
గరం మసాలా పొడి -      ఒక టీస్పూన్
నూనె లేదా నెయ్యి -      రెండు టేబుల్ స్పూన్‌లు
తాజా కొత్తిమీర -           కొద్దిగా (తరగాలి)
ఉప్పు            -           రుచికి సరిపడా.

తయారుచేసే పద్ధతి : 
  • చికెన్ బ్రెస్ట్‌ను శుభ్రంగా కడిగి చదరపు ముక్కలుగా కోసుకోవాలి. 
  • టొమాటోలు మిక్సీలో వేసి గుజ్జుగా చేసి పక్కన పెట్టుకోవాలి. 
  • మొక్కజొన్న గింజల్లో నాలుగు కప్పుల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. వాటిని వడకట్టాలి.
  • నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి అది వేడెక్కాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేగించాలి. ఇందులో టొమాటో గుజ్జు వేసి సన్నటి మంట మీద కాసేపు ఉంచాలి. ఆ తరువాత చికెన్ ముక్కలు వేసి కలిపి ఎక్కువ తక్కువ కాకుండా ఓ మాదిరి మంట మీద ఉడికించాలి. కొద్ది సేపటి తరువాత ఉప్పు, మసాలా దినుసులు వేసి మధ్య మధ్యలో కలపాలి. ఆ తరువాత పెరుగు, ఉడికించిన మొక్కజొన్న గింజలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి మసాలా దగ్గర పడి, చికెన్ ముక్కలు ఉడికే వరకు ఉంచాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా రోటి లేదా నాన్‌తో తింటే వర్షపు ముసురుకు భలే రుచిగా ఉంటుంది.

మూలం : సూర్య దినపత్రిక 

0 Comments

రొయ్యల చిగురు 

6/18/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
చింతచిగురు     -        కప్పు 
రొయ్యలు         -        పావుకిలో 
వెల్లుల్లి తురుము -      టేబుల్ స్పూన్ 
ఉల్లిపాయల ముక్కలు -  అరకప్పు 
ఉప్పు             -         తగినంత 
పసుపు           -         పావుటీస్పూన్
వెన్న              -         2 టేబుల్ స్పూన్లు 
కారం              -          2 టీస్పూన్లు 

తయారుచేసే పద్ధతి :
  • నాన్ స్టిక్ పాన్ లో కాస్త వెన్న వేసి కాగాక, రొయ్యలు, కాస్త ఉప్పు, కారం వేసి వేయించాలి. నీళ్లన్నీ  ఇగిరి రొయ్యలు వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. 
  • అదే పాన్ లో మిగిలిన వెన్న వేసి వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. తరువాత మిగిలిన కారం, ధనియాల పొడి రొయ్యలు వేసి కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన చింతచిగురు వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. 
  • అవసరమైతే మరికొంత ఉప్పును, కాసిని నీళ్ళు చిలకరించి చిగురు పూర్తిగా రొయ్యలకూ పట్టే వరకు ఉడికించి దించాలి. ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు.

మూలం : ఈనాడు ఆదివారం 

0 Comments

చికెన్ క్యారెట్ కర్రీ 

6/17/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
చికెన్ ముక్కలు -           పెద్ద కప్పు 
క్యారెట్లు           -            6(ముక్కల్లా తరగాలి)
ఉల్లిపాయ        -             1 (సన్నగా తరగాలి)
ఉప్పు             -             తగినంత 
నూనె              -             రెండు టీస్పూన్లు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ -           చెంచ 
పసుపు           -             కొద్దిగా 
మిరియాల పొడి -             చెంచ 
కొత్తిమీర తరుగు -             కొద్దిగా 
గరం మసాలా     -             చెంచ 

తయారుచేసే పద్ధతి :
  • బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, చికెన్ ముక్కలు వేసి, రెండు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టాలి. ఐదు నిమిషాలయ్యాక క్యారెట్ ముక్కలు, తగినంత ఉప్పు, గరం మసాలా వేసి మళ్ళీ మూత పెట్టాలి. ఇరవై ఐదు నిమిషాలకు అన్నీ ఉడుకుతాయి. పైన కొత్తిమీర చల్లి వడ్డించాలి.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

ధనియా చికెన్ ఫ్రై 

6/11/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
కోడి మాంసం         -           250 గ్రా.
పట్టా, లవంగం       -           కొంచెం 
నూనె                  -           5 స్పూన్లు 
కారం పొడి            -           ఒకటిన్నర స్పూన్లు 
పసుపు               -           అర స్పూన్ 
వెల్లుల్లి                -            6 పాయలు 
అల్లం                  -            6 చిన్న ముక్కలు 
ధనియాలు          -             4 స్పూన్లు
                                                                   ఉల్లిపాయలు        -             2 (పెద్దవి)(తరిగి పెట్టుకోవాలి)
                                                                    కొబ్బరి               -              ఒక ముక్క 
                                                                   పచ్చిమిరపకాయలు -           3(తరిగి పెట్టుకోవాలి)

తయారుచేసే పద్ధతి :
  • ముందుగా కోడి మాంసాన్ని కడిగి ఒక పాత్రలో వేసుకోవాలి. తర్వాత మాంసానికి కారం పొడి, పసుపు కలపాలి. తర్వాత అల్లం, వెల్లుల్లికి కొంచెం ఉప్పు చేర్చి పేస్ట్ లా చేసుకొని, మాంసానికి పట్టించాలి. 
  • తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె పోసి, బాగా కాగాక మాంసం ముక్కలు అందులో వేసి, కొన్ని నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి. 
  • మరో వైపు ధనియాలను మూకుడులో వేయించి (నూనె లేకుండా), కొబ్బరి, పట్టా, లవంగాలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. 
  • ఇప్పుడు మరో బాణలిలో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉడికించిన మాంసాన్ని కలపాలి. మాంసం దించుకునే సమయంలో ధనియా, కొబ్బరి మిశ్రమాన్ని పైన చల్లుకోవాలి. తర్వాత మాంసాన్ని బాగా కలబెట్టి దించుకోవాలి. ఇంతే ఘుమఘుమలాడే ధనియా చికెన్ ఫ్రై రెడీ.


మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

రొయ్యల పులుసు 

6/10/2013

2 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
రొయ్యలు          -           250 గ్రా.
ఉల్లిపాయలు      -          రెండు (పెద్దవి )
అల్లం                -          చిన్న ముక్క 
వెల్లుల్లి              -          రెండు పాయలు 
టమోటా           -           150 గ్రా.
బంగాళాదుంప   -            1 పెద్దది
పచ్చిమిరపకాయలు -       2
నూనె                -          150 గ్రా.
కారం పొడి          -          3 టీ స్పూన్లు 
పసుపు             -           చిటికెడు 
కరివేపాకు          -           5 రెమ్మలు 
కొత్తిమీర             -          కొంచెం    
ఉప్పు               -        తగినంత 

తయారుచేసే పద్ధతి :
  • మొదట రొయ్యలను శుభ్రం చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేసుకోవాలి. అదే విధంగా టమోటాలు, ఉల్లిపాయ, బంగాళాదుంపను (చెక్కు తీసి) చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
  • తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు (మధ్యలో చీల్చి) వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.  అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ కలిపి ఐదు నిముషాలు ఉడికించాలి. తర్వాత రొయ్యలు వేయాలి. అనంతరం చిటికెడు పసుపు వేసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి. అలాగే టమోటా, బంగాళాదుంప ముక్కలు, కారం పొడి, ఉప్పు వేసి మరో పది నిముషాలు మూత పెట్టి ఉడికించాలి. కాసేపయ్యాక కొంచెం నీళ్ళు పోసి, ఈ మిశ్రమం దగ్గరకు అయ్యేవరకు ఐదు నిముషాలు సిమ్ లో ఉడికించి దించేయాలి. 


మూలం : సాక్షి దినపత్రిక 

2 Comments

చింత చిగురు మాంసం:

6/7/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
చింత చిగురు         -         అరకిలో 
మాంసం               -         అరకిలో (చికెన్ లేదా మటన్)
కొబ్బరి తురుము    -          2 టీస్పూన్లు 
కొత్తిమీర               -           కట్ట 
ధనియాల పొడి      -            టీస్పూన్ 
అల్లం వెల్లుల్లి ముద్ద -           టీస్పూన్ 
జీలకర్ర                 -          టీస్పూన్ 
పుదీనా                -          కట్ట 
ఆవాలు                -          టీస్పూన్ 
నూనె                  -           టేబుల్ స్పూన్ 
ఉల్లిపాయ             -           ఒకటి 
కారం                   -           2 టీస్పూన్లు 
ఉప్పు                  -            రుచికి సరిపడా 
పసుపు               -             చిటికెడు 
గరం మసాలా        -             టీస్పూన్ 

తయారుచేసే పద్ధతి :
  • నాన్ స్టిక్ పాన్ స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు కూడా వేసి వేయించాలి. అవి వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తర్వాత కొబ్బరి తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు మటన్ లేదా చికెన్ వేసి ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి కలపాలి. తరువాత ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మాంసం ఉడికే వరకూ ఉంచాలి. ఉడికిన తర్వాత చింత చిగురు వేసి మరో ఐదు నిముషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి ఒక నిమిషం ఉంచి దించాలి.

మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం 

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. .

    Categories

    All
    మటన్
    మటన్
    గోష్ కా దాల్చా
    చికెన్
    2e7c0e6d6f
    63aa27ab43
    986220a369
    D372e92fc1

    Archives

    January 2014
    December 2013
    November 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.