telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

ప్రాన్ మప్పాస్

4/23/2013

0 Comments

 
కావలసిన పదార్ధాలు :

రొయ్యలు                 :         500 గ్రాములు
నూనె                     :         4 టేబుల్ స్పూన్లు
ఆవాలు                   :          ఒక టీస్పూన్
ఉల్లిపాయ                 :        పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి )
వెల్లుల్లి ముక్కలు       :         ఒక టీస్పూన్
అల్లం                      :         అర టీ స్పూన్
చింతపండు              :         కొద్దిగా
పచ్చిమిరపకాయలు  :         రెండు లేదా మూడు
కరివేపాకు                :        రెండు రెమ్మలు
ఉప్పు                      :          తగినంత


గ్రైండ్ చేయడానికి :
వేయించిన ధనియాల పొడి :         రెండు టేబుల్ స్పూన్లు
వేయించిన ఎండుమిరపకాయలు :  అర టీస్పూన్
పసుపు                    :           పావు టీస్పూన్
మిరియాల పొడి          :          చిటికెడు
వెల్లుల్లి రెమ్మలు         :           రెండు
మెంతులు                 :           కొద్దిగా


తయారీ విధానం :

            ముందుగా ఒక మూకుడు లో నూనె పోసి, వేడి అయిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడక ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పొడి మసాలా వేసి ఒకటిన్నర కప్పుల నీళ్ళు, చింతపండు రసం, ఉప్పు వేసి బాగా కలపుకోవాలి. ఆ తర్వాత  పచ్చిమిరపకాయలు, కరివేపాకు, రొయ్యలు వేసి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి.

మూలం : స్వాతి సపరివార పత్రిక

0 Comments

గ్రాండ్ మా చికెన్ రోల్ 

4/23/2013

0 Comments

 
కావలసిన పదార్ధాలు :

ఉడికించిన చికెన్       :        150 గ్రాములు  
వెల్లుల్లి ముక్కలు      :         ఒక టీస్పూన్
ఉల్లిపాయ                 :        పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి )
పచ్చిమిరపకాయలు :         రెండు లేదా మూడు
క్యాప్సికం                 :       2 (ముక్కలుగా చేసుకోవాలి )
కారం                       :        రెండు టీస్పూన్లు
వైట్ సాస్                  :        కొద్దిగా
బ్రెడ్ ముక్కలు          :         2
నూనె                       :        15 ml
ఉప్పు                      :          తగినంత



తయారీ విధానం :

ముందుగా చికెన్ సన్నని ముక్కలుగా  కట్ చేయాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి, బాగా కాగిన తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉడికించి ఉంచుకున్న చికెన్ ముక్కలు వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం పొడి, వైట్ సాస్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నె లో కొద్దిగా నీళ్ళు తీసుకొని బ్రెడ్ ముక్కల్ని నానబెట్టాలి. తర్వాత నీటిని పిండేసి బ్రెడ్ ముక్కలఫై మద్యలో చికెన్ మిశ్రమము ఉంచి, బ్రెడ్ ను  మడిచేసి రోల్ చేసుకోవాలి. ఒక భాండి లో నూనె పోసి వేడి అయిన తర్వాత రోల్ చేసిన బ్రెడ్
ముక్కలని వేసి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి. వేగాక ఒక్కొక్క రోల్ ని రెండు గా కట్ చేసుకోవాలి. దీనికి టమాటో కెచప్ మంచి కాంబినేషన్.

మూలం : స్వాతి సపరివార పత్రిక

0 Comments

కోడి వేపుడు 

4/23/2013

1 Comment

 
కావలసిన పదార్ధాలు :

చికెన్                        :        120 గ్రాములు  
అల్లం వెల్లుల్లి పేస్ట్       :        2 టేబుల్ స్పూన్లు
పసుపు                    :        ఒక టీస్పూన్
జీలకర్ర పొడి              :        ఒక టీస్పూన్
నిమ్మ రసం              :          2 టేబుల్ స్పూన్లు
ఆవాలు                    :         ఒక టీస్పూన్
వెల్లుల్లి ముక్కలు      :         ఒక టీస్పూన్
కరివేపాకు                :         కొద్దిగా
ఎండుమిరపకాయలు:    ఒకటి లేదా రెండు
ఉల్లిపాయ                :        పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి )
క్యాప్సికం                :       2 (ముక్కలుగా చేసుకోవాలి )
కారం                      :        రెండు టీస్పూన్లు
ధనియాల పొడి        :         రెండు టీస్పూన్లు
కొత్తిమీర                  :         కొద్దిగా
నూనె                     :        40 ml
గుడ్లు                      :         2
ఉప్పు                     :          తగినంత


తయారీ విధానం :

                పసుపు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు పేస్ట్, గుడ్లు, సగం నిమ్మ రసం, ఉప్పు కలిపి చికెన్ ముక్కలు నానపెట్టాలి. ఈ ముక్కలను కొంచెం సేపు నూనె లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక భాండి లో నూనె వేసి బాగా వేడి అయిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. అందులో ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, కారం, ధనియాల పొడి వేసి కొద్ది సేపు ఉంచాలి. ఈ మిశ్రమము లో చికెన్ కలుపుకొని, కొత్తిమీర, మిగతా నిమ్మరసం కలుపుకోవాలి. వేడివేడిగా కోడి వేపుడు అదుర్స్...

మూలం : స్వాతి సపరివార పత్రిక

1 Comment

త్రివేండ్రం చికెన్ వేపుడు 

4/23/2013

0 Comments

 
కావలసిన పదార్ధాలు :

చికెన్                      :        20 ముక్కలు
అల్లం వెల్లుల్లి పేస్ట్     :        2 టేబుల్ స్పూన్లు
పసుపు                  :        ఒక టీస్పూన్
కాశ్మీరీ కారం           :        మూడు టీస్పూన్లు
ధనియాల పొడి        :        ఒక టీస్పూను
చింతపండు నీళ్ళు    :         రెండు టీస్పూన్లు
పెరుగు                   :         ఒక టీస్పూను
గుడ్డు                     :         1
కొబ్బరి నూనె         :          3 టేబుల్ స్పూన్లు (ఇష్టం లేని వాళ్ళు నచ్చినది వాడుకోవచ్చు)
ఉప్పు                   :          తగినంత


తయారీ విధానం :

                 నూనె మినహా మిగిలిన పదార్ధాలన్నీ కలపి కనీసం అర గంట సేపు నానపెట్టాలి. బాండి లో నూనె వేసి బాగా కాగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి మెత్తబడే దాక ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి. అంతే, త్రివేండ్రం చికెన్ ఫ్రై రెడీ.....

మూలం : స్వాతి సపరివార పత్రిక

0 Comments

చికెన్ రోస్ట్ 

4/23/2013

0 Comments

 
కావలసిన పదార్ధాలు :

చికెన్                       :        1 కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్      :        2 టేబుల్ స్పూన్లు
మిరియాలు             :         10
లవంగాలు               :         5
దాల్చిన చెక్క           :          2
యాలకులు             :          4
ఎండుమిరపకాయలు:          3
నిమ్మకాయల రసం  :          2 టేబుల్ స్పూన్లు
నూనె                      :          3 టేబుల్ స్పూన్లు
ఉప్పు                     :          తగినంత


తయారీ విధానం :

             మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంతకు ముందు పొడి చేసుకున్న సగం పొడి కలిపి 2 గంటలు నానపెట్టాలి. ఒక బాండి లో నూనె వేడి చేసి కారం, మిగతా మసాలా పొడి వేసుకోవాలి. నాన పెట్టిన చికెన్ వేసి ఉడికిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. అంతే,  ఘుమఘుమలాడే చికెన్ రోస్ట్ రెడీ....

మూలం : స్వాతి సపరివార పత్రిక
0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. .

    Categories

    All
    మటన్
    మటన్
    గోష్ కా దాల్చా
    చికెన్
    2e7c0e6d6f
    63aa27ab43
    986220a369
    D372e92fc1

    Archives

    January 2014
    December 2013
    November 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.