telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

పాయా సూప్

1/4/2014

0 Comments

 
Picture
కావలసినవి:
మేక కాళ్లు - 4 (నాలుగేసి ముక్కలుగా కట్ చేయాలి);
టొమాటో ప్యూరీ - కప్పు;
ఉల్లితరుగు - రెండు కప్పులు;
గరంమసాలా - టీ స్పూను;
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు;
ధనియాలపొడి - టేబుల్ స్పూను;
పచ్చిమిర్చి - 5;
కొబ్బరితురుము - 2 టేబుల్ స్పూన్లు;
కారం - 2 టీ స్పూన్లు;
మిరియాల పొడి - టీ స్పూను (పొడి మరీ మెత్తగా ఉండకూడదు);
పసుపు - కొద్దిగా;
కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను;
నూనె - 3 టేబుల్ స్పూన్లు;
లవంగాలు - 6;
ఏలకులు - 4;
దాల్చినచెక్క - చిన్న ముక్క;
బిరియానీ ఆకు - 1;
ఉప్పు - తగినంత

తయారి:
  • ఒక కప్పు ఉల్లితరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరితురుము వేసి మెత్తగా పేస్ట్ చేసి, పక్కన ఉంచాలి.
  • లెగ్ పీసులను శుభ్రంగా కడగాలి. దీనిలో లీటరు నీరు, పసుపు, ఉప్పు జత చేసి కుకర్‌లో ఉంచి ఆరు విజిల్స్ రానివ్వాలి.
  • బాణలిలో నూనె కాగాక, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, బిరియానీ ఆకు వేసి బాగా కలిపి, అల్లంవెల్లుల్లి పేస్ట్ జత చేయాలి.
  • ఉల్లితరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి.
  • ధనియాలపొడి, కారం, గరంమసాలా, మిరియాలపొడి వేసి ఒక నిముషం పాటు వేయించాలి.
  • ఈ మొత్తం మిశ్రమాన్ని, కుకర్‌లో ఉడికించి ఉంచుకున్న లెగ్ పీస్‌లలో వేసి, తరువాత టొమాటో ప్యూరీ జత చేసి సుమారు రెండు నిముషాలు సన్నని మంట మీద ఉడికించాలి.
  • తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి మసాలా, అర లీటరు నీరు జతచేసి, మంట పెద్దది చేసి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.


0 Comments

నాటుకోడి కూర

12/28/2013

0 Comments

 
Picture
కావలసినవి:
మసాలా పేస్ట్ కోసం
ధనియాలు - టేబుల్ స్పూన్ (దోరగా వేయించినవి)
మిరియాలు - కొద్దిగా
కొబ్బరితురుము - అర టేబుల్ స్పూన్
వెల్లుల్లి రేకలు - 7
అల్లంతరుగు - కొద్దిగా


కూర కోసం:
చికెన్ ముక్కలు - 8
నూనె - 3 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు
పచ్చిమిర్చి - 4; ఉల్లితరుగు - పావు కప్పు
కారం - టీ స్పూను; నీరు - ఒకటిన్నర కప్పులు
గరంమసాలా - టీ స్పూను; ఉప్పు - తగినంత
కొత్తిమీర - గార్నిషింగ్‌కి సరిపడా

మసాలాపేస్ట్ తయారి:
మిరియాలు, కొబ్బరితురుము, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, కొద్దిగా నీరు జతచేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

కూర తయారి:
  • ప్రెజర్‌పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక చికెన్ ముక్కలు వేసి వేయించాలి. కారం, పసుపు జత చేయాలి. కొద్దిగా నీరు పోసి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
  • బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
  • ఉడికించిన చికెన్ ముక్కలు, తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ జత చేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి.
  • కొద్దిగా నీరు, గరంమసాలా, ఉప్పు వేసి, మంట తగ్గించి రెండుమూడు నిముషాలు ఉంచి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.


0 Comments

చిల్లీ చికెన్

11/30/2013

0 Comments

 
Picture
చిల్లీ చికెన్ తయారు చేయడానికి కావలసినవి:
చికెన్ - 250 గ్రాములు
ఉల్లిపాయ - 1
కారంపొడి - 1 టేబిల్ స్పూన్
అజినొమొటొ - చిటికెడు
పచ్చిమిర్చి - 2
పంచదార - 1/2 టేబిల్ స్పూన్
సోయా సాస్ - 1 టేబిల్ స్పూన్
చిల్లీ సాస్ - 1 టేబిల్ స్పూన్
టమాటా సాస్ - 2 టేబిల్ స్పూన్
తందూర్ కలర్ - చిటికెడు
మిరియాలపొడి - 1/2 టేబిల్ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 3 టేబిల్ స్పూన్


  • ఉల్లిపాయ తరిగి ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి. 
  • కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, ఉప్పు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కారం పొడి వేసి కలిపి మూతపెట్టి రెండు విజిల్స్ రాగానే దింపేయాలి.
  • చికెన్ కడిగిన నీళ్లు ఊరతాయి కాబట్టి మళ్లీ విడిగా నీరు పోయనవసరం లేదు.
  • ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లి తరుగు వేసి దోరగా వేపాలి. ఇందులో అజినొమొటొ, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, పంచదార వేసి కలపాలి.
  • రెండు నిమిషాల తర్వాత కలర్, మిరియాలపొడి కూడా వేసి కలిపి చికెన్ ముక్కలు వేయాలి. ఉప్పు సరి చూసుకుని మొత్తం కలుపుతూ తడి పూర్తిగా పోయేవరకు వేయించాలి. తర్వాత ఉల్లిపొరకతో అలంకరించి సర్వ్ చేయాలి.


0 Comments

మటన్ బిర్యానీ 

11/23/2013

0 Comments

 
Picture
కావలసినవి:
బాస్మతి బియ్యం - అర కిలో;
బిరియానీ ఆకు, నల్ల ఏలకులు, ఆకుపచ్చ ఏలకులు - 2 చొప్పున;
నువ్వులు - 2 టీ స్పూన్లు;
మిరియాలు, లవంగాలు - 6 చొప్పున;
దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ - కొద్దికొద్దిగా;
మెంతులు - టీ స్పూను;
ఉప్పు - 3 టీ స్పూన్లు;
మటన్ - కేజీ;
గరంమసాలా - టేబుల్ స్పూను;
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు;
బొప్పాయి గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు;
పుల్ల పెరుగు - 4 టేబుల్ స్పూన్లు;
నిమ్మరసం - టీ స్పూను;
కారం, ఉప్పు - తగినంత;
ఉల్లితరుగు, టొమాటో ప్యూరీ,
చల్లటి పాలు - పావు కప్పు చొప్పున;
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు;
కుంకుమపువ్వు - కొద్దిగా;
నూనె - కొద్దిగా;
రోజ్ వాటర్ - రెండు చుక్కలు;
పచ్చిమిర్చి - 4;
ధనియాల పొడి, జీలకర్ర పొడి- టీ స్పూన్ చొప్పున;
పుదీనా, కొత్తిమీర - కొద్దిగా

తయారి:
  • ఒక పాత్రలో మటన్, పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, బొప్పాయి గుజ్జు, కారం, నిమ్మరసం, గరంమసాలా వేసి మూడు గంటలపాటు మారినేట్‌చేయాలి.
  • బాణలిలో నూనె వేసి వేడయ్యాక, సగం ఉల్లితరుగు వేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.
  • పాన్‌లో నెయ్యి వేసి కరిగాక మిగిలిన ఉల్లితరుగు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మరోమారు కలపాలి.
  • మ్యారినేట్ చేసిన మటన్ జత చేసి బాగా మగ్గిన తర్వాత, టొమాటో ప్యూరీ వేసి కలపాలి.
  • ధనియాలపొడి, జీలకర్రపొడి వేసి కలపాలి.
  • మూడు కప్పుల నీరు పోసి మూత ఉంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉంచాలి. (అవసరానికి తగ్గట్టు నీరు ఎక్కువ వేసుకుని, మాడకుండా చూసుకోవాలి)
  • పాన్ మూత తీసి ఉప్పు, గరంమసాలా, కొత్తిమీర వేసి పది నిముషాలు ఉడికించాలి.

అన్నం తయారి:
  • బియ్యాన్ని 20 నిముషాలు నానబెట్టి కడిగి, నీరు ఒంపేయాలి.
  • ఒక వస్త్రంలో ఏలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ ముక్క, మిరియాలు వేసి మూట కట్టాలి.
  • 750 మి.లీ. నీటిని మరిగించి, అందులో బియ్యం, బిరియానీ ఆకు, ఉప్పు, మూట కట్టిన వస్త్రం ఉంచి అన్నం మూడు వంతులు ఉడికాక, నీరు ఒంపేసి, మూట తీసేయాలి.
  • ఒక కప్పులో పాలు, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.
  • ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక పాత్రకు కిందకు దింపి, పాత్ర అంతా అంటేలా పాత్రను కదపాలి.
  • ఉడికించిన బియ్యం, మటన్ ముక్కలు, కుంకుమపువ్వు పాలు, వేయించిన ఉల్లితరుగు, నెయ్యి వరుసగా ఒకదాని మీద ఒకటిగా లేయర్లుగా పరచాలి. మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా అమర్చాలి.
  • పైన పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, వేయించిన ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ వేసి గట్టి మూత ఉంచి స్టౌ మీద ఉంచాలి. 20 నిముషాల తర్వాత దించేయాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి.


0 Comments

కీమా బాల్స్

11/15/2013

0 Comments

 
Picture
కావలసినవి:
మటన్ కీమా - 250 గ్రా; కొత్తిమీర - అర కప్పు
అల్లం - చిన్నముక్క; వెల్లుల్లి రేకలు - 5
పచ్చిమిర్చి - 3; కారం - టీ స్పూను
ధనియాలపొడి - టీ స్పూను
ఉప్పు - తగినంత

తయారి:
  • కీమాను శుభ్రం చేసి బాగా కడిగి తడిపోయే వరకు ఆరనివ్వాలి.
  • మిక్సీలో సగం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా నీరు వేసి మెత్తగా పేస్ట్‌లా చేయాలి.
  • కారం, ఉప్పు, కీమా, ధనియాలపొడి, వేసి మెత్తగా చేయాలి.
  • మిశ్రమాన్ని బయటకు తీసి చిన్నచిన్న బాల్స్‌లా చేయాలి.
  • ఒక పాత్రలో నీరు పోసి ఈ బాల్స్‌ని అందులో వేసి బాగా ఉడికించాలి. (ఇవి ఉడకడానికి సుమారు 10 నిముషాల పైనే పడుతుంది)
  • నీటిని వడ పోసి బాల్స్‌ను పేపర్ టవల్ మీద ఉంచాలి.
  • బాణలిలో నూనె పోసి కాగాక ఈ బాల్స్‌ని నూనెలో వేసి బాగా వేయించి తీసేయాలి.

0 Comments

కర్డ్ - మటన్ బిర్యానీ

9/24/2013

0 Comments

 
Picture
 కావలసినవి:
  మటన్ - అర కేజీ
 ఉప్పు - తగినంత
 అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను
 పసుపు - కొద్దిగా
 పెరుగు - లీటరు
 ధనియాలపొడి - టీ స్పూను
 ఏలకులపొడి - టీ స్పూను
 మిరియాలపొడి - అర టీ స్పూను
 దాల్చినచెక్కపొడి - కొద్దిగా
 నెయ్యి - వంద గ్రాములు
 లవంగాలు - 10
 నీళ్లు - కప్పు
 బియ్యం - అర కేజీ


 తయారి:
  •  మటన్‌ను ముక్కలుగా కోసి బాగా కడగాలి.
  •  ఒక పాత్రలో మటన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
  •   ఒక పాత్రలో అర లీటరు పెరుగు, ధనియాలపొడి, ఏలకులపొడి, మిరియాలపొడి, దాల్చినచెక్కపొడి, కప్పుడు నీళ్లు వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని మటన్‌లో వేసి (గంటసేపు) పక్కన ఉంచాలి.
  •  పెద్ద పాన్‌లో మటన్ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి.
  •  బాణలిలో నెయ్యి వేడి చేసి, లవంగాలు వేయించి, నెయ్యితో పాటే మటన్ మీద వెయ్యాలి.
  •  బియ్యం కడిగి, మిగిలిన పెరుగును బియ్యంలో కలిపి పాన్‌లో ఉన్న మటన్ మీద వేసి సర్ది మిగిలిన నెయ్యి కూడా వేసి మూత పెట్టి మంట మీద ఉడకనివ్వాలి. ఆవిరి వస్తున్నప్పుడు సిమ్‌లో పెట్టి పావుగంట ఉడకనిచ్చి దించాలి.
  •  వేడిగా ఉండగానే పెద్ద ప్లేట్‌లోకి తిరగదీసి, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
  •  (నీళ్లు లేకుండా పెరుగుతో మాత్రమే వండే బిర్యానీ రెడీ).


0 Comments

టీ స్మోక్డ్ చికెన్ వింగ్స్

9/16/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
చికెన్ వింగ్స్ - 16
వెల్లుల్లిపాయలు - 3 రెబ్బలు
అల్లం పేస్ట్ - ఒక స్పూన్
తేనె - ఒక స్పూన్
సోయాసాస్ - 3/4 కప్పు
క్రీమ్ షెర్రీ - అర కప్పు
బ్రౌన్ షుగర్ - 3/4 కప్పు
టెట్లీ టీ పొడి - ఒక కప్పు
నల్ల నువ్వులు - కొద్దిగా


తయారు చేసే విధానం :
చికెన్ వింగ్స్ చివరలను కొద్దిగా కట్ చేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్, తేనె, సోయాసాస్, క్రీమ్ షెర్రీలను కలపాలి. దీన్ని ఒక బేకింగ్ పాన్‌లో పెట్టి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. టెట్లీ టీ పొడిని నీళ్ళలో కలిపి ఈ ముక్కల మీద చిలకరించుకోవాలి. ఈ ముక్కలను ఒక సీకుకు కుచ్చాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఈ సీకులను వాటి మీద ఉంచి మూత పెట్టేయాలి. సన్నని మంట మీద అరగంట పాటు ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి మరికాసేపు వేగనివ్వాలి. ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత 450డిగ్రీల వద్ద ఓవెన్‌లో ఐదు నిమిషాల పాటు ఉంచాలి. చివరగా నువ్వులను పై నుంచి చల్లుకొని సర్వ్ చేయాలి. నోరూరించే టీ స్మోక్డ్ చికెన్ వింగ్స్ మీ ముందుంటాయి.


0 Comments

గోష్ కా దాల్చా

9/15/2013

0 Comments

 
Picture
కావలసినవి:
శనగపప్పు - 200 గ్రా.;

నూనె - పావు కిలో
షాజీరా - టేబుల్ స్పూను
దాల్చినచెక్క - అర టీ స్పూను
లవంగాలు - 10; ఏలకులు - 10
ఉల్లితరుగు - 100 గ్రా.;

అల్లంవెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా.
కారం - 100 గ్రా.;

కరివేపాకు - నాలుగు రెమ్మలు
 పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత
 పచ్చిమిర్చి - 10 (సన్నగా తరగాలి)
 మిరియాలపొడి - టీ స్పూను
 కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా కట్ చేయాలి)
 సొరకాయ ముక్కలు - 500 గ్రా.
 టొమాటో ముక్కలు - 400 గ్రా.
 చింతపండు - 100గ్రా. (నానబెట్టి గుజ్జు తీసుకోవాలి)
 ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు
 జీలకర్రపొడి - రెండు టీ స్పూన్లు
 పుదీనా - చిన్న కట్ట
 మటన్ ముక్కలు - 500 గ్రా.


 తయారి:
  •   శనగపప్పును ఉడికించి మెత్తగా చేసుకోవాలి.
  •  మటన్‌ను బాగా కడిగి తగినంత నీరు జత చేసి సుమారు అరగంటసేపు ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
  •  బాణలిలో నూనె వేసి కాగాక, షాజీరా, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి.
  •  ఉల్లి తరుగు జతచేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
  •  అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
  •  కారం, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
  •  ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తరుగు వేసి ఒక నిముషం వేయించాలి.
  •  సొరకాయ ముక్కలు, టొమాటో తరుగు, ఉడికించిన మటన్, మెత్తగా చేసిన శనగపప్పు వేసి, అన్నీ ఉడికేవరకు ఉంచాలి.
  •  చింతపండు గుజ్జు వేసి పది నిముషాలపాటు ఉడికించాలి.
  •  ధనియాలపొడి, జీలకర్రపొడి, పుదీనా ఆకులు వేసి రెండు నిముషాలు బాగా కలిపి దించేయాలి.

0 Comments

మునగాకు - చికెన్ గ్రేవీ కర్రీ

9/7/2013

0 Comments

 
Picture
కావలసినవి
చికెన్ - 800 గ్రా.,

మునగాకు - 200 గ్రా,
మసాలా పొడి - టేబుల్ స్పూను
ధనియాల పొడి - టేబుల్ స్పూను
కారం - టీ స్పూను,

పచ్చిమిర్చి పేస్ట్ - టేబుల్ స్పూను,
పసుపు - కొద్దిగా,
ఉప్పు - తగినంత
నూనె - తగినంత,

అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర తరుగు - కొద్దిగా,
ఉల్లితరుగు - కప్పు,
చికెన్ స్టాక్ - 300 మి.లీ.

తయారి
  • చికెన్ శుభ్రం చేసి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ జతచేసి సుమారు గంటసేపు మ్యారినేట్ చేయాలి.
  • బాణలిలో నూనె కాగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
  • పచ్చిమిర్చి పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేయించాలి.
  • మ్యారినేట్ చేసిన చికెన్ జత చేసి బాగా ఉడికించాలి.
  • గరంమసాలా వేసి ఐదు నిముషాలు ఉడికించాలి.
  • చికెన్ స్టాక్ వేసి, మంట తగ్గించి, చికెన్ మెత్తగా అయ్యేవరకు అంటే సుమారు 20 నిముషాలు ఉడికించాలి.
  • మునగాకు జతచేసి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి.
  • చపాతీలలోకి గాని, అన్నంలోకి గాని రుచిగా ఉంటుంది.

0 Comments

జింజర్ ప్రాన్స్

8/31/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు
ప్రాన్స్         : 200గ్రా
ఉల్లిపాయ పేస్ట్     : ఒక కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్     : అర కప్పు
అజినమోటో     : టి స్పూన్
ఉప్పు         : తగినంత
మిరియాల పొడి     : టీ స్పూన్
కారం         : రెండు టీ స్పూన్లు
నూనె         : డీప్ ఫ్రైకి సరిపడా
టొమాటో సాస్     : టీ స్పూన్
సోయా సాస్     : టీ స్పూన్
ఫుడ్ (రెడ్) కలర్     : చిటికెడు
కొత్తిమీర తరుగు     : రెండు టీ స్పూన్లు

తయారుచేసే పద్ధతి :

ముందుగా ప్రాన్స్‌ని శుభ్రం చేసి వేడినీటిలో కాస్త ఉడి కించి పక్కనపెట్టుకోవాలి. పాన్‌లో అరకప్పు నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, అజిన మోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత గ్లాస్‌ నీరు పోసి ఉడి కించాలి. మిశ్రమం దగ్గర పడేటప్పుడు టొమాటో సాస్‌, సోయా సాస్‌, ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి. ఇందులో ఉడి కించిన రొయ్యలను కలిపి నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి. దోరగా వేయించిన జింజర్‌ ప్రాన్స్‌ను సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి.


0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. .

    Categories

    All
    మటన్
    మటన్
    గోష్ కా దాల్చా
    చికెన్
    2e7c0e6d6f
    63aa27ab43
    986220a369
    D372e92fc1

    Archives

    January 2014
    December 2013
    November 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.