మటన్ - అర కేజీ
ఉప్పు - తగినంత
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను
పసుపు - కొద్దిగా
పెరుగు - లీటరు
ధనియాలపొడి - టీ స్పూను
ఏలకులపొడి - టీ స్పూను
మిరియాలపొడి - అర టీ స్పూను
దాల్చినచెక్కపొడి - కొద్దిగా
నెయ్యి - వంద గ్రాములు
లవంగాలు - 10
నీళ్లు - కప్పు
బియ్యం - అర కేజీ
తయారి:
- మటన్‌ను ముక్కలుగా కోసి బాగా కడగాలి.
- ఒక పాత్రలో మటన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
- ఒక పాత్రలో అర లీటరు పెరుగు, ధనియాలపొడి, ఏలకులపొడి, మిరియాలపొడి, దాల్చినచెక్కపొడి, కప్పుడు నీళ్లు వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని మటన్‌లో వేసి (గంటసేపు) పక్కన ఉంచాలి.
- పెద్ద పాన్‌లో మటన్ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి.
- బాణలిలో నెయ్యి వేడి చేసి, లవంగాలు వేయించి, నెయ్యితో పాటే మటన్ మీద వెయ్యాలి.
- బియ్యం కడిగి, మిగిలిన పెరుగును బియ్యంలో కలిపి పాన్‌లో ఉన్న మటన్ మీద వేసి సర్ది మిగిలిన నెయ్యి కూడా వేసి మూత పెట్టి మంట మీద ఉడకనివ్వాలి. ఆవిరి వస్తున్నప్పుడు సిమ్‌లో పెట్టి పావుగంట ఉడకనిచ్చి దించాలి.
- వేడిగా ఉండగానే పెద్ద ప్లేట్లోకి తిరగదీసి, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
- (నీళ్లు లేకుండా పెరుగుతో మాత్రమే వండే బిర్యానీ రెడీ).