కావలసిన పదార్థాలు :
బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ - అరకేజి,
కోడిగుడ్డు -ఒకటి (గిలక్కొట్టి),
కొవ్వులేని పాలు - మూడు టేబుల్ స్పూన్లు,
చీజ్ - అర కప్పు,
కారం - అర టీస్పూన్,
మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ - పావు టీస్పూన్,
వెన్న - రెండు టేబుల్ స్పూన్లు,
తేనె - ముప్పావు కప్పు,
బ్రెడ్ క్రంబ్స్ - కొంచెం,
నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే పద్ధతి :
చికెన్ బ్రెస్ట్ను నిలువుగా పన్నెండు ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన, పాలు పోసి కలపాలి. మరో గిన్నెలో చీజ్, కారం, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. వెన్నని వేడిచేయాలి. చికెన్ ముక్కల్ని ఒక్కోదాన్ని ముందు గుడ్డు మిశ్రమంలో ముంచి ఆ తరువాత బ్రెడ్ క్రంబ్ మిశ్రమంలో దొర్లించాలి. వీటిని కడాయిలో నూనె వేడిచేసి వేగించాలి. ఈ టెంటర్స్ను తేనెతో వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరు.