కావలసినవి
చికెన్ - 800 గ్రా.,
మునగాకు - 200 గ్రా,
మసాలా పొడి - టేబుల్ స్పూను
ధనియాల పొడి - టేబుల్ స్పూను
కారం - టీ స్పూను,
పచ్చిమిర్చి పేస్ట్ - టేబుల్ స్పూను,
పసుపు - కొద్దిగా,
ఉప్పు - తగినంత
నూనె - తగినంత,
అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర తరుగు - కొద్దిగా,
ఉల్లితరుగు - కప్పు,
చికెన్ స్టాక్ - 300 మి.లీ.
తయారి
చికెన్ - 800 గ్రా.,
మునగాకు - 200 గ్రా,
మసాలా పొడి - టేబుల్ స్పూను
ధనియాల పొడి - టేబుల్ స్పూను
కారం - టీ స్పూను,
పచ్చిమిర్చి పేస్ట్ - టేబుల్ స్పూను,
పసుపు - కొద్దిగా,
ఉప్పు - తగినంత
నూనె - తగినంత,
అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర తరుగు - కొద్దిగా,
ఉల్లితరుగు - కప్పు,
చికెన్ స్టాక్ - 300 మి.లీ.
తయారి
- చికెన్ శుభ్రం చేసి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ జతచేసి సుమారు గంటసేపు మ్యారినేట్ చేయాలి.
- బాణలిలో నూనె కాగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
- పచ్చిమిర్చి పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేయించాలి.
- మ్యారినేట్ చేసిన చికెన్ జత చేసి బాగా ఉడికించాలి.
- గరంమసాలా వేసి ఐదు నిముషాలు ఉడికించాలి.
- చికెన్ స్టాక్ వేసి, మంట తగ్గించి, చికెన్ మెత్తగా అయ్యేవరకు అంటే సుమారు 20 నిముషాలు ఉడికించాలి.
- మునగాకు జతచేసి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి.
- చపాతీలలోకి గాని, అన్నంలోకి గాని రుచిగా ఉంటుంది.